AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌లో తొలి డిజిటల్‌ ఎయిర్‌పోర్ట్‌.. నావీ ముంబైలో ప్రారంభించిన ప్రధాని మోదీ

బుధవారం (అక్టోబర్ 9) ప్రధాని నరేంద్ర మోదీ నావీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ముందుగా మోడీ కొత్తగా నిర్మించిన విమానాశ్రయంలో దిగారు. నావీ ముంబై ఎయిర్‌పోర్ట్‌ ప్రయాణాలతో ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్ట్‌పై భారం తగ్గనుంది. నావీ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఆటోమేటెడ్‌ సౌకర్యాలు ఉన్నాయి. భారత్‌లో ఇది తొలి డిజిటల్‌ ఎయిర్‌పోర్ట్‌.

భారత్‌లో తొలి డిజిటల్‌ ఎయిర్‌పోర్ట్‌.. నావీ ముంబైలో ప్రారంభించిన ప్రధాని మోదీ
Pm Modi Inaugurates Navi Mumbai International Airport
Balaraju Goud
|

Updated on: Oct 08, 2025 | 4:21 PM

Share

బుధవారం (అక్టోబర్ 9) ప్రధాని నరేంద్ర మోదీ నావీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ముందుగా మోడీ కొత్తగా నిర్మించిన విమానాశ్రయంలో దిగారు. నావీ ముంబై ఎయిర్‌పోర్ట్‌ ప్రయాణాలతో ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్ట్‌పై భారం తగ్గనుంది. నావీ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఆటోమేటెడ్‌ సౌకర్యాలు ఉన్నాయి. భారత్‌లో ఇది తొలి డిజిటల్‌ ఎయిర్‌పోర్ట్‌.

ముంబైలో రెండో ఎయిర్‌పోర్ట్‌ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. నావీ ముంబై ఎయిర్‌పోర్ట్‌ కలర్‌ఫుల్‌గా ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ , డిప్యూటీ సీఎంలు షిండే,అజిత్‌పవార్‌ , కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తదితరులు హాజరయ్యారు. 19,650 కోట్ల రూపాయలతో నావీ ముంబై ఎయిర్‌పోర్ట్ ఫస్ట్‌ ఫేజ్‌ను నిర్మించారు. 2016లో ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు.

కొత్తగా నిర్మించిన ఎయిర్‌పోర్టులోనే దిగి, ప్రారంభించిన ప్రధాని మోదీ, ఈ తర్వాత టెర్మినల్‌ను వివరంగా పరిశీలించారు. దాని అత్యాధునిక డిజైన్, ప్రయాణీకుల సౌకర్యాల గురి ఆరా తీశారు. ఈ పర్యటన సందర్భంగా, తనను స్వాగతించిన వికలాంగ పిల్లలతో ప్రధాని మోదీ సంభాషించారు. భారతీయ జెండాలను ఊపుతూ, పువ్వులు చల్లుతూ ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. వారి సంజ్ఞ గొప్ప ప్రారంభోత్సవ వేడుకకు హృదయాలను కదిలించింది.

పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) మోడల్ కింద రూ. 19,650 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన NMIA భారతదేశంలో అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ ప్రాజెక్టుగా అవతరించింది. ఆధునిక మౌలిక సదుపాయాలకు కొత్త చిహ్నంగా నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన జహా హదీద్ ఆర్కిటెక్ట్స్ భావనలో దీని అద్భుతమైన కమలం ఆకారపు టెర్మినల్ డిజైన్, భారతదేశ జాతీయ పుష్పాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది స్వచ్ఛత, పెరుగుదల, స్థితిస్థాపకతను సూచిస్తుంది. టెర్మినల్ లోపల నిర్మాణ స్తంభాలు విచ్చకున్న పూవ్వు రేకులను పోలి ఉంటాయి. విమానాశ్రయానికి ఒక ఐకానిక్ నిర్మాణ గుర్తింపును ఇస్తాయి.

విమానాశ్రయం మొదటి దశ సంవత్సరానికి 20 మిలియన్ల ప్రయాణీకుల నిర్వహణ సామర్థ్యాన్ని కలిగి ఉంది. పూర్తయిన తర్వాత, NMIA నాలుగు టెర్మినల్స్, రెండు సమాంతర రన్‌వేలను కలిగి ఉంటుంది. ఇవి 90 MPPA వరకు సేవలను అందించగలవు. ఏటా 3.25 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణా సాగనుంది. ఈ సౌకర్యం ముంబైలోని ప్రస్తుత ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (CSMIA)పై వాయు ట్రాఫిక్ ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తుంది. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని భారతదేశంలోని మొట్టమొదటి డ్యూయల్-ఎయిర్‌పోర్ట్ హబ్‌గా మారుస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..