ముంబైలో భారీ అగ్నిప్రమాదం

ఓ వైపు కరోనాతో గజగజ వణికిపోతున్న ముంబైలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మండల ప్రాంతంలోని మన్‌కుర్ద్‌-గట్కోపర్ రహదారి సమీపంలో ఉన్న కుర్లా గోడౌన్‌లో మంటలు చెలరేగాయి.

  • Tv9 Telugu
  • Publish Date - 10:24 am, Tue, 23 June 20
ముంబైలో భారీ అగ్నిప్రమాదం

ఓ వైపు కరోనాతో గజగజ వణికిపోతున్న ముంబైలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మండల ప్రాంతంలోని మన్‌కుర్ద్‌-గట్కోపర్ రహదారి సమీపంలో ఉన్న కుర్లా గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో అక్కడి స్థానికులు వెంటనే స్థానిక పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించారు. నాలుగు ఫైర్‌ ఇంజన్లతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకోచ్చారు. ఇది 1500 చదరపు అడుగుల్లో ఉన్న ఈ గోడౌన్‌లో స్క్రాప్‌ నిల్వా ఉంచినట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు. అంతేకాదు.. వేస్టేజ్ ఆయిల్‌ డ్రమ్స్‌ కూడా నిల్వా ఉంచినట్లు గుర్తించారు. అయితే ఘటనకు సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.