AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FASTag: ఇంకా ఫాస్టాగ్ తీసుకోలేదా..? అయితే అలెర్ట్ అవ్వండి… ఎందుకంటే రేపటి నుంచి..

Fastag Is Compulsory From Tomorrow: దేశవ్యాప్తంగా రేపటి నుంచి (ఫిబ్రవరి 15) ఫాస్టాగ్ తప్పనిసరి కానుంది. దేశంలో ఉన్న టోల్ ప్లాజాల వద్ద నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించే క్రమంలో...

FASTag: ఇంకా ఫాస్టాగ్ తీసుకోలేదా..? అయితే అలెర్ట్ అవ్వండి... ఎందుకంటే రేపటి నుంచి..
Narender Vaitla
|

Updated on: Feb 14, 2021 | 7:52 PM

Share

Fastag Is Compulsory From Tomorrow: దేశవ్యాప్తంగా రేపటి నుంచి (ఫిబ్రవరి 15) ఫాస్టాగ్ తప్పనిసరి కానుంది. దేశంలో ఉన్న టోల్ ప్లాజాల వద్ద నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ‘ఫాస్టాగ్’ విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిద్వారా ఇకపై టోల్ ప్లాజాల వద్ద వాహనాలు పెద్ద ఎత్తున ఆగకుండా వేగంగా వెళ్లే అవకాశం కలగనుంది. నిజానికి ఈ ఫాస్టాగ్ విధానాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇది వరకే పలు తేదీలను ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు ఈ చివరి తేదీ మూడుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. కానీ తాజాగా ఫిబ్రవరి 15ను కచ్చితంగా చివరి తేదీ అని కేంద్రం స్పష్టం చేసింది. సోమవారం నుంచి ఫాస్టాగ్ లేకుండా టోల్ ప్లాజాలు క్రాస్ చేసే వాహనాలు రెట్టింపు టోల్ వసూళు చేయనున్నారు. ఇదిలా ఉంటే ఫాస్టాగ్‌ను టోల్ ప్లాజాల వద్ద కానీ పలు ఆన్‌లైన్ సేవల ద్వారాకానీ కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించారు. ఇక రీచార్జ్ కూడా ఆన్‌లైన్‌లోనే చేసుకునే వెసులుబాటు కల్పించారు. టోల్ ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన స్కానర్ల ద్వారా వాహనాలకు అతికించిన ఫాస్టాగ్‌ కార్డులు స్కాన్ అవ్వడంతో ఆటోమెటిక్‌గా గేట్ ఓపెన్ అవుతుంది.

ఫాస్టాగ్‌ను ఎలా కొనుగోలు చేయాలి..?

ఫాస్టాగ్‌ను కొనుగోలు చేయడానికి చాలా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. దేశంలోని అన్ని టోల్ ఫ్లాజాల వద్ద ఈ ఫాస్టాగ్‌ను కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించారు. అంతేకాకుండా పేటీఎమ్ ద్వారా సొంతంగా మొబైల్ ఫోన్‌లోనే ఫాస్టాగ్ కొనుగోలు చేయొచ్చు. దీంతో పాటు హెచ్‌డీ‌ఎఫ్‌సీ, ఐసీఐసీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొటాక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకింగ్ సంస్థలు కూడా ఫాస్టాగ్ కొనుగోలుకు అవకాశం కల్పించారు. ఫాస్టాగ్ కార్డులో వినియోగదారుడు అతనికి నచ్చిన మొత్తంలో రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉంది. కాఇక ఫాస్టాగ్ పరిమితి కాలం విషయానికొస్తే.. జారీ చేసిన నాటి నుంచి ఐదేళ్లు ఉంటుంది. కొత్తగా కొనుగోలు చేసిన కార్లు ఇప్పటికే FASTag అమర్చబడి ఉన్నాయి. వీటిని యాక్టివేట్ చేసుకోవాలి.

ఫాస్టాగ్‌కు కావాల్సినవి..

ఫాస్టాగ్‌ కావాలంటే పైన పేర్కొన్న బ్యాంకుల్లో వాహనం ఆర్సీ, గుర్తింపు కార్డు జిరాక్సులు రెండు సెట్లు, ఓ పాస్ పోర్టు సైజు ఫోటో, ఛార్జ్ చెల్లించాలి. గుర్తింపు కార్డు అంటే ఆధార్ లేదా పాన్ లేదా ఓటరు కార్డు వంటివి ఉపయోగించవచ్చు.

Also Read: రూ.1,50,000 కరెంట్​ బిల్లు.. ఇదేంటని అడిగితే చేయి చేసుకున్న అధికారులు.. రైతన్న ఆత్మహత్య