Pashu Credit Card: రైతులకు అదిరిపోయే న్యూస్.. గేదెలు కొనేందుకు ప్రభుత్వ సాయం.. వివరాలివే..
రైతుల ఆదాయాన్ని పెంచేందుకు భారత ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా అనేక పథకాలను అమలు చేస్తోంది. వ్యవసాయం అంటే పంటల సాగు మాత్రమే కాదు.. ఇందులోనూ అనేక విభాగాలు ఉన్నాయి. వ్యవసాయంలో పశుపోషణ అనేది రైతులకు ఆదాయం పెంచే మార్గం.

రైతుల ఆదాయాన్ని పెంచేందుకు భారత ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా అనేక పథకాలను అమలు చేస్తోంది. వ్యవసాయం అంటే పంటల సాగు మాత్రమే కాదు.. ఇందులోనూ అనేక విభాగాలు ఉన్నాయి. వ్యవసాయంలో పశుపోషణ అనేది రైతులకు ఆదాయం పెంచే మార్గం. దేశంలో పశుపోషణను ప్రోత్సహించేందుకు కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలు ఎన్నో కీలక పథకాలను అమలు చేస్తున్నాయి. తాజాగా రైతుల కోసం ప్రభుత్వం ‘పశు క్రెడిట్ కార్డు’ పథకాన్ని ప్రారంభించింది. యానిమల్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ కింద ప్రభుత్వం పశుపోషణకు రుణాలు ఇస్తోంది. పశు క్రెడిట్ కార్డు పథకం కింద ఆవులు, గేదెల కొనుగోలు లేదా నిర్వహణ కోసం ప్రభుత్వం రైతులకు రూ.1.60 లక్షల రుణాన్ని అందజేస్తోంది. యానిమల్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
పశు క్రెడిట్ కార్డ్ స్కీమ్ కింద లభించే రుణం ప్రత్యేకత ఏంటంటే.. ఈ రుణం పొందడానికి రైతులు ఎలాంటి హమీ పత్రాలు, తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. యానిమల్ క్రెడిట్ కార్డుపై లభించే రుణంపై 7 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇందురో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే.. రైతు సరైన సమయంలో రుణాన్ని తిరిగి చెల్లిస్తే.. 3 శాతం రాయితీ కూడా లభిస్తుంది. అంటే.. రైతు తాను తీసుకున్న రుణంపై కేవలం 4 శాతం వడ్డీ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
యానిమల్ క్రెడిట్ కార్డుపై తీసుకున్న రుణాన్ని రైతులు 5 సంవత్సరాల లోపు చెల్లించాల్సి ఉంటుంది. మీరు కూడా ఈ యానిమల్ క్రెడిట్ కార్డును పొందాలనుకుంటే.. సమీపంలో బ్యాంకుకు వెళ్లి, అక్కడి అధికారుల సహకారంతో కార్డును పొందవచ్చు. అవసరమైన పత్రాలను సమర్పించడం ద్వారా కార్డును పొందవచ్చు. దరఖాస్తు చేసిన నెల లోపు యానిమల్ క్రెడిట్ కార్డు మీకు వస్తుంది.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..