AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinder Pal Singh Bhatia: మాజీ మంత్రి, బీజేపీ నేత భాటియా ఆత్మహత్య.. ఇంట్లో ఉరి వేసుకుని..

BJP leader Rajinder Pal Singh Bhatia: ఛత్తీస్‌గఢ్ మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజిందర్ పాల్ సింగ్ భాటియా ఆత్మహత్య చేసుకున్నారు. రాజ్‌నంద్‌గావ్ జిల్లాలోని తన

Rajinder Pal Singh Bhatia: మాజీ మంత్రి, బీజేపీ నేత భాటియా ఆత్మహత్య.. ఇంట్లో ఉరి వేసుకుని..
Rajinder Pal Singh Bhatia
Shaik Madar Saheb
|

Updated on: Sep 20, 2021 | 8:53 AM

Share

BJP leader Rajinder Pal Singh Bhatia: ఛత్తీస్‌గఢ్ మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజిందర్ పాల్ సింగ్ భాటియా ఆత్మహత్య చేసుకున్నారు. రాజ్‌నంద్‌గావ్ జిల్లాలోని తన నివాసంలో రాజిందర్ పాల్ సింగ్ భాటియా ఉరి వేసుకుని మరణించారు. సమచారం అనంతరం పోలీసులు ఆయన ఇంటికి చేరుకొని పరిశీలించారు. అనంతరం భాటియా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలం నుంచి సూసైడ్ నోట్ లభించిందా లేదా అనే విషయాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించలేదు.

కాగా.. చురియా పట్టణంలో నివాసముంటున్న భాటియాకు ఈ ఏడాది మార్చిలో కొవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయింది. కరోనా నుంచి కోలుకున్న అనంతరం భాటియా కొన్ని అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. రాజిందర్ పాల్ సింగ్ భాటియా రాజ్‌నంద్‌గావ్ జిల్లాలోని ఖుజ్జి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. భాటియా ముఖ్యమంత్రి రమణ్ సింగ్ నేతృత్వంలోని మొదటి బీజేపీ ప్రభుత్వంలో వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. రాజిందర్ పాల్ సింగ్ భాటియా భార్య కొన్ని సంవత్సరాల క్రితం మరణించింది.

Also Read:

Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలోని 9 మంది దుర్మరణం.. అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా..

Drug Racket: ఆఫ్ఘన్‌ టు బెజవాడ.. భారీ డ్రగ్ రాకెట్ గుట్టురట్టు.. రూ.9 వేల కోట్ల హెరాయిన్ స్వాధీనం..