AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Millionaire: ఇండియాలోని ఈ గ్రామ ప్రజలు రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు.. మ్యాటర్ తెలిస్తే అవాక్కవుతారు..

Millionaire: ఎవరి విధి రాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. అదృష్టం వరించాలే గానీ.. ఒక్కసారిగా జీవితాలే..

Millionaire: ఇండియాలోని ఈ గ్రామ ప్రజలు రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు.. మ్యాటర్ తెలిస్తే అవాక్కవుతారు..
Village
Shiva Prajapati
|

Updated on: Apr 06, 2021 | 7:46 PM

Share

Millionaire: ఎవరి విధి రాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. అదృష్టం వరించాలే గానీ.. ఒక్కసారిగా జీవితాలే మారిపోతాయి. అలాంటి అదృష్టమే ఒక్కరికి కాదు.. ఇద్దరికి కాదు.. ఏకంగా ఒక గ్రామ ప్రజలందరినీ వరించింది. ఆ దెబ్బకు వారంతా రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు. మరి ఆ గ్రామం ఎక్కడ ఉంది?, వారిని వరించిన అదృష్టం ఏంటి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

దేశానికి వెన్నెముక గ్రామాలే అని అంటుంటారు. దేశంలో సగానికిపైగా జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తోంది. పలు గ్రామాలు అభివృద్ధి చెందితే.. ఇంకొన్ని గ్రామాలు కనీస సౌకర్యాలు లేక పేదరికంలో మగ్గిపోతున్నాయి. అయితే ఇక్కడ ఓ గ్రామానికి చెందిన ప్రజలు కూడా కనీస వసతులు లేకుండానే జీవనం సాగిస్తున్నారు. అలాంటి గ్రామ ప్రజలు ఒక్కసారిగా ధనవంతులైపోయారు. అసలు మ్యాటర్‌లోకి వెళితే.. ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్ జిల్లాలో బొమ్జా అనే గ్రామం ఉంది. ఆ గ్రామ ప్రజలు ఒక్క రోజులోనే ధనవంతులు అయిపోయారు. కోట్ల రూపాయలు అందుకుని కోటీశ్వరులుగా నిలిచారు.

వారిని వరించిన అదృష్టం ఇదే.. బొమ్జా గ్రామంలో 200 ఎకరాల భూమిని రక్షణ మంత్రిత్వ శాఖ 2018 ఫిబ్రవరి నెలలో స్వాధీనం చేసుకుంది. ఈ గ్రామంలో మొత్తం 31 కుటుంబాలు నివసిస్తుండగా.. వారి భూములు తీసుకున్నందుకు గానూ కేంద్ర ప్రభుత్వం వారికి రూ .41 కోట్లు పరిహారంగా ఇచ్చింది. రక్షణ శాఖ ఆధ్వర్యంలో ప్రాజెక్టు నిర్మాణం కోసం ఈ భూమిని సేకరించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ఈ భూమిని తీసుకున్నందుకు పరిహారంగా గ్రామంలో నివసిస్తు్న్న కుటుంబాలన్నింటికీ పరిహారం చెల్లించారు. అధికారిక లెక్కల ప్రకారం.. ఒక కుటుంబానికి గరిష్ఠంగా రూ.6.73 కోట్లు చెల్లించగా.. మరో కుటుంబానికి రూ. 2.44 కోట్లను కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ చెల్లించింది. ఇక మిగిలిన 29 కుటుంబాలకు రూ. 1.09 కోట్ల చొప్పున పరిహారం అందజేశారు. అలా పరిహారాన్ని అందుకున్న గ్రామస్తులు రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారిపోయారు.

Also read:

Tirupati MP by election : కొబ్బరి బొండాలమ్మకం.. సైకిల్ తొక్కుడు, పనబాక ప్రచార పరంపరలో పదనిసలు

Premi Vishwanath: సోషల్ మీడియాలో వంటలక్కకు చేదు అనుభవం.. నయనతారతో పోల్చుతూ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..