PF ఖాతాదారులకు శుభవార్త.. ఒకేసారి అకౌంట్లోకి డబ్బులు.. స్టాక్ మార్కెట్లే కారణామా?..

పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త అందించింది ప్రముఖ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సంస్థ. EPFO వడ్డీ మొత్తాన్ని పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్‏లలోకి ఒకేసారి జమచేయనుంది.

PF ఖాతాదారులకు శుభవార్త.. ఒకేసారి అకౌంట్లోకి డబ్బులు.. స్టాక్ మార్కెట్లే కారణామా?..
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 10, 2020 | 1:28 PM

పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త అందించింది ప్రముఖ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సంస్థ. EPFO వడ్డీ మొత్తాన్ని పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్‏లలోకి ఒకేసారి జమచేయనుంది. ఈపీఎఫ్‏వో తన ఈక్విటీ ఇన్వెస్ట్‏మెంట్లను అమ్మకాలు ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్‏లో ఆల్‏టైమ్ గరిష్టాల్లో ఉంది. దీంతో ఈపీఎఫ్‏వో ఈక్విటీ ఇన్వెస్ట్‏మెంట్లను విక్రయించనుంది. అయితే ఇలా చేస్తే ఈపీఎఫ్‏వోకు అధిక లాభాలు రానుండంతో ఈపీఎఫ్‏వో వడ్డీ మొత్తాన్ని ఒకేసారి ఖాతాదారుల అకౌంట్లలో జమ చేయనున్నట్లు తెలుస్తున్నాయి.

కాగా ఇప్పటికే కార్మిక శాఖ 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 8.5 వడ్డీ మొత్తాన్ని ఒకేసారి పీఎఫ్ ఖాతాదారులకు అందించేందుకు కేంద్ర ఆర్థిక శాఖకు లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. దీనికి వారం రోజుల్లో అనుమతి లభించేలా ఉంది. అటు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సీబీటీ సెప్టెంబర్ నెలలో పీఎఫ్ వడ్డీ రేటును రెండు విడతల్లో ఖాతాదారుల అకౌంట్లలో జమ చేస్తామని ప్రకటించింది. కరోనా నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం నెలకోనడంతో ఈక్విటీ ఇన్వెస్ట్‏మెంట్లను విక్రయించలేకపోతున్నామని, అందుకే రెండు విడతల్లో వడ్డీ డబ్బులు జమ చేస్తామని తెలిపింది. కేంద్రం నుంచి అనుమతి రాగానే పీఎఫ్ ఖాతాదారులకు వడ్డీ మొత్తాన్ని ఒకేసారి జమచేయనున్నారు.