Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంచనలంగా మారిన ఏక్‌నాథ్‌ షిండే జై గుజరాత్‌ నినాదం! మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉండి..

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే "జై గుజరాత్" నినాదంతో తన ప్రసంగం ముగించడం వివాదాస్పదంగా మారింది. ప్రతిపక్షాలు షిండేపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రం షిండేను సమర్థించారు. మరాఠీ భాష, గౌరవంపై జరుగుతున్న చర్చ, రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఈ వివాదం ప్రాధాన్యతను సంతరించుకుంది.

సంచనలంగా మారిన ఏక్‌నాథ్‌ షిండే జై గుజరాత్‌ నినాదం! మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉండి..
Eknath Shinde
SN Pasha
|

Updated on: Jul 04, 2025 | 8:42 PM

Share

MNS కార్యకర్తలు దుకాణదారుడిపై దాడి చేసిన వివాదం కొనసాగుతున్న తరుణంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శుక్రవారం తన ప్రసంగాన్ని “జై గుజరాత్” నినాదంతో ముగించారు. పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. హోంమంత్రి అమిత్ షాను ప్రశంసిస్తూ, తన ప్రసంగాన్ని “జై హింద్, జై మహారాష్ట్ర, జై గుజరాత్” ఈ నినాదంతో ముగించారు.

ప్రతిపక్షాల నుంచి విమర్శలు

షిండే చేసిన జై గుజరాత్‌ నినాదంపై ప్రతిపక్ష సభ్యులు విమర్శలు గుప్పిస్తున్నారు. అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌కు చెందినవారు కాబట్టి షిండే ఈ నినాదం పలికారని, ఆయనకు “అధికార దాహం” ఉందనంటూ ఎన్‌సిపి (ఎస్పీ) నాయకుడు క్లైడ్ క్రాస్టో ఆరోపించారు.

సంకుచిత ఆలోచన..: ఫడ్నవీస్

అయితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ షిండేను సమర్థిస్తూ.. “షిండే ‘జై గుజరాత్’ అని అన్నంత మాత్రాన, షిండే మహారాష్ట్ర కంటే గుజరాత్‌ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడని అర్థం కాదు. అలాంటి సంకుచిత ఆలోచన మరాఠీ ప్రజలకు ఉండదు అంటూ అని ఫడ్నవీస్ షిండేను వెనకేసుకొచ్చారు.

వివాదం ఎందుకు..?

ముంబైలో మరాఠీ మాట్లాడటానికి నిరాకరించారనే ఆరోపణలతో రాజ్ థాకరేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తలు దుకాణదారులను కొట్టిన వీడియోలు వైరల్ అయిన తర్వాత ఈ నినాదాల వివాదం మొదలైంది. బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్ర పాఠశాలల్లో 1వ తరగతి నుండి హిందీని మూడవ భాషగా ప్రవేశపెట్టాలని ప్రయత్నించిన తర్వాత, రాబోయే పౌర ఎన్నికలకు, మరాఠీ భాష, మరాఠీ గౌరవంపై వివాదం తలెత్తింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి