Pralhad Joshi: ఈసీపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కౌంటర్!
కేంద్ర ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కౌంటర్ ఇచ్చారు. రాహుల్ ఎలాంటి ఆధారాలు లేకుండా ఈసీపై ఆరోపణలు చేశారన్నారు. గతంలో చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వమని అతనికి ఈసీ లేఖ రాసిందని.. వాటిపై ఆయన ఇంకా స్పందించలేదని అన్నారు. ఎందుకంటే ఆయన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని కేంద్రమంత్రి ఎద్దేవా చేశారు.

కేంద్ర ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్రంమంత్రి ప్రహ్లాద్ జోషి కౌంటర్ ఇచ్చారు. రాహుల్ ఎలాంటి ఆధారాలు లేకుండా ఈసీపై ఆరోపణలు చేశారన్నారు. గతంలో చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని అతనికి ఈసీ లేఖ రాసిందని వాటిపై ఆయన ఇంకా స్పందించలేదని అన్నారు. ఎందుకంటే ఆయన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని కేంద్రమంత్రి ఎద్దేవా చేశారు. ఈ విషయంలో అధికారిక చర్యలను ప్రారంభించడానికి సంతకం చేసిన అఫిడవిట్‌ను సమర్పించాలని మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా ప్రధాన ఎన్నికల అధికారి రాహుల్ గాంధీని కోరారని.. కానీ ఆయన ఇప్పటివరకు వాటిని సమర్పించలేదని కేంద్రమంత్రి తెలిపారు.
రాహుల్ గాంధీని ప్రజలు అధికారం నుండి తొలగించిన తర్వాత, ఆయన అబద్ధాల దుకాణం మొదలు పెట్టాడని కేంద్రమంత్రి ఎగతాలి చేశారు. రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకొని ఎమర్జెన్సీ విధించిన నాటి ఇందిరా గాంధీ నుంచి వారు రాజ్యాంగ సంస్థల గురించి తమకు నచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో సమయంలో 70 లక్షల మంది ఓటర్లు అదనంగా చేరారని ఆయన చెప్పారు. కానీ చేరింది 40 లక్షల మంది ఓటర్లేనని ఈసీ స్పష్టం చేసిందని ఆయన అన్నారు. గురువారం జరిగిన విలేకరుల సమావేశంలోనూ ఆయన కోటి మంది ఓటర్లు పెరిగారని అన్నారు. రాఫెల్ అంశంపై కూడా ఆయన అబద్ధం చెప్పారని ఆయన అన్నారు. 2004, 2009లో యుపీఎ ప్రభుత్వ హయాంలో మహారాష్ట్రలో ఓటర్ల సంఖ్య పెరిగింది. ఎన్డీఏ హయాంలో కూడా ఇది పెరిగిందన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




