Duologue NXT: నటి రోనా-లీ షిమోన్ అంతరంగాన్ని ఆవిష్కరించిన బరుణ్ దాస్
‘Duologue with Barun Das’ సీరీస్‌లో భాగంగా Duologue NXT అనే కొత్త షో ప్రారంభమవుతుంది. వేదికపై, తెరపై తన అద్భుతమైన ప్రతిభతో ప్రఖ్యాతి పొందిన గ్లోబల్ స్టార్ రోనా-లీ షిమోన్.. TV9 నెట్‌వర్క్ MD & CEO బరుణ్ దాస్‌తో.. తన జీవిత ప్రయాణం సహా పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.

TV9 నెట్‌వర్క్ MD & CEO బరుణ్ దాస్ వ్యాఖ్యాతగా కొత్త ప్రొగ్రామ్ రాబోతుంది. రాడికో ఖైతాన్ సమర్పణలో కొత్త షో Duologue NXT షురూ అయింది. ఈ షోలో ప్రముఖ అంతర్జాతీయ నటి రోనా-లీ షిమోన్ తొలి గెస్ట్‌గా పాల్గొన్నారు. హిట్ సీరీస్ ఫౌదాలో నురిన్ పాత్రతో ఆమె ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. తన జీవితంలోని సవాళ్లు, ప్రయత్నాలు, లక్ష్యాల సాధన గురించి.. ఆమె బరుణ్ దాస్‌తో పంచుకున్నారు
మన ప్రయాణంలో ఆటుపోట్లు ఎదురైనా.. పట్టుదలతో ముందుకు వెళ్లాలన్న విషయాన్ని ఆమె హైలెట్ చేశారు. ‘సో యు థింక్ యూ కెన్ డ్యాన్స్’ షోలో ఐదో స్థానంలో నిలిచినా.. తర్వాతి రోజే మూవీలో నటించే అవకాశం వచ్చినట్లు చెప్పారు. ఫెయిల్యూర్ వెనుక కూడా అవకాశాలు దాగుంటాయని.. ఈ విషయం నిరూపిస్తుందన్నారు. కష్టపడి ప్రయత్నిస్తే.. ఏ పరిస్థితుల్లో అయినా విజయాలు సాధించవచ్చని చెప్పారు.
“జీవితంలో ఏ నిర్ణయం సరైనది అని ఉండదు. మీరు ఒక నిర్ణయం తీసుకుని దానిని సరైనదిగా మార్చుకోవాలి. ఫెయిల్యూర్ అనేది ఆప్షన్ కాదు. ఫలితం ఏది అయినా.. మీరు నేర్చుకుంటూ వెళ్తుంటే అది ఎప్పటికీ నిరూపయోగం అవ్వదు” అని బరుణ్ దాస్ వ్యాఖ్యానించారు.
కష్టపడి పని చేస్తూ.. లక్ష్యంపై నమ్మకం కలిగి ఉండి.. సరైన మార్గంలో ప్రయాణిస్తుంటేనే కలలు నిజమవుతాయని షిమోన్ షోలో చెప్పుకొచ్చారు. “మీరు నిజంగా కోరుకునే లక్ష్యానికి అందుబాటులో ఉండాలి. ఎల్లప్పుడూ కష్టపడండి. మీరు మీపై నమ్మకం ఉంచి.. ఇది కాదు అవ్వదు అనే అంశాలను అస్సలు పట్టించుకోవద్దు” అని ఆమె చెప్పకొచ్చారు.
ఇంటర్వ్యూ చూడండి..
Duologue NXT లోని ఈ తొలి ఎపిసోడ్ ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభంగా భావించవచ్చు. మహిళలు సొంతగా నిర్ణయాలు తీసుకునే లీడర్స్‌గా.. ఇతరులకు స్ఫూర్తిగా నిలవడానికి ఈ షో దోహదపడుతుంది. పూర్తి ఎపిసోడ్ News9 లో 22 సెప్టెంబర్ 2025 రాత్రి 10:30 గంటలకు ప్రసారం అవుతుంది. అలాగే Duologue YouTube ఛానల్ (@Duologuewithbarundas), News9 Plus యాప్ ద్వారా కూడా స్ట్రీమ్ చేయవచ్చు.




