365 కేసుల ఛేదనలో తోడ్పడిన ఆ ‘పోలీస్ డాగ్’ ఇక లేదు

పోలీసు శునకాలంటే పోలీసులతో సమానంగా కేసుల పరిష్కారంలో కృషి చేసేవి.మూగ జీవాలైనప్పటికీ వాటి చురుకుదనం, తెలివితేటలు అపారం. హత్య కేసులే కాకుండా..

365 కేసుల ఛేదనలో తోడ్పడిన ఆ 'పోలీస్ డాగ్' ఇక లేదు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 17, 2020 | 3:18 PM

పోలీసు శునకాలంటే పోలీసులతో సమానంగా కేసుల పరిష్కారంలో కృషి చేసేవి.మూగ జీవాలైనప్పటికీ వాటి చురుకుదనం, తెలివితేటలు అపారం. హత్య కేసులే కాకుండా..డ్రగ్స్, పేలుడు పదార్థాలు, నేరస్థుల ఆచూకీని కనుగొనడం వంటి అనేక కేసుల దర్యాప్తులో..శిక్షణ పొందిన జాగిలాలు ఎంతగానో తోడ్పడతాయి. మహారాష్ట్రలోని బీద్ జిల్లాలో ఇలా ఖాకీలకు 365 కేసుల ఇన్వెస్టిగేషన్ లో సహకరించిన పోలీసు శునకం ‘రాకీ’ ఆదివారం మరణించింది. ఇప్పటివరకు తమకు ఎంతో సహాయ కారిగా ఉన్న రాకీ మృతి పట్ల  బీద్ పోలీసులు తీవ్ర సంతాపం తెలిపారు. దానికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు.

కొంతకాలంగా అనారోగ్యంగా ఉండి మరణించిన  ఈ పోలీసు జాగిలానికి వారు ‘నివాళి’ అర్పించారు.