రూ. 15,000 కోట్ల ముఖేష్ అంబానీ-నీతా కలల ఇల్లును డిజైన్ చేసింది ఎవరో తెలుసా? ఓ బాలీవుడ్ సూపర్ స్టార్ భార్య!
దేశంలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ అనే విషయం చాలామందికి తెలిసిన విషయంమే. ఆయన ఇల్లు, హెలికాప్టర్, కార్లు బంగ్లా ప్రతిదీ ఖరీదైన వ్యవహారమే. అయితే ముంబైలో నిర్మించిన ఈ ఇంటి ధర దాదాపు రూ.15,000 కోట్లు ఉంటుందని అంచనా. ఇది భారతదేశంలో అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ ప్రాపర్టీ.

దేశంలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ అనే విషయం చాలామందికి తెలిసిన విషయమే. ఆయన ఇల్లు, హెలికాప్టర్, కార్లు బంగ్లా ప్రతిదీ ఖరీదైన వ్యవహారమే. అయితే ముంబైలో నిర్మించిన ఈ ఇంటి ధర దాదాపు రూ.15,000 కోట్లు ఉంటుందని అంచనా. ఇది భారతదేశంలో అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ ప్రాపర్టీ. ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ సంస్థ పెర్కిన్స్ & విల్ దీనిని నిర్మించింది. ఆస్ట్రేలియాకు చెందిన లైటన్ ఏషియా దీనిని తయారు చేసింది. యాంటిలియా అనేది దక్షిణ ముంబైలోని ఆల్టామౌంట్ రోడ్‌లో నిర్మించిన 27-అంతస్తుల రెసిడెన్షియల్ టవర్. 4,00,000 చదరపు అడుగుల నివాస స్థలంతో, టవర్ అన్ని అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దబడింది.
థియేటర్, స్పా, స్విమ్మింగ్ పూల్, హెల్త్ సెంటర్, హై-స్పీడ్ లిఫ్ట్, స్నో రూమ్, 160 కంటే ఎక్కువ వాహనాల కోసం గ్యారేజ్, మూడు హెలిప్యాడ్ ఉండేలా డిజైన్ చేయబడింది. ఈ భవనం రిక్టర్ స్కేలుపై ఎనిమిది తీవ్రతతో సంభవించే భూకంపాలను తట్టుకోగలదు. బయటి నుంచి గ్రాండ్‌గా కనిపించే యాంటిలియా లోపల కూడా అద్భుతంగా ఉంది. ఇందులో చాలామందికి తెలియని మరో విషయం కూడా ఉంది. ఇది దాని లాంజ్ ప్రాంతానికి కనెక్ట్ చేయబడింది. దీని లాంజ్ ఏరియాను డిజైన్ చేసిన ఘనత బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ కు దక్కుతుంది.
గౌరీ కూడా సుప్రసిద్ధ ఇంటీరియర్ డిజైనర్. ఆమె 2019లో యాంటిలియాలోని బార్ లాంజ్ క్రియేటివిటీకీ బాగా పేరుంది. గౌరీ ఖాన్, నీతా అంబానీతో కలిసి కంప్లీట్ చేశారు. గౌరీ ఖాన్ డిజైన్స్ వ్యవస్థాపకురాలు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ సహ వ్యవస్థాపకురాలు. ఆమెఇంటీరియర్ డిజైన్ చేయడంలో మంచి స్కిల్స్ ఉన్నాయి. ఆమె చాలా మంది టాప్ సెలబ్రిటీల ఇళ్ల లోపలికి కూడా మ్యాజికల్ టచ్ ఇచ్చింది. వీరిలో రణబీర్ కపూర్, కరణ్ జోహార్, అలియా భట్ వంటి బాలీవుడ్ ప్రముఖులు ఉన్నారు. గౌరీ ఖాన్ నికర విలువ దాదాపు రూ.1,600 కోట్లు ఉంటుంది. డిజైనింగ్ పట్ల తన అంకితభావం, అభిరుచితో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఈమె బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ భార్య అనే విషయం తెలిసిందే.