AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతుల ఆందోళనకు మద్దతు తెలిపిన తమిళ రాజకీయ వేత్త.. ఈ విషయం గురించి ఇప్పటికే కోర్టుకు వెళ్లామని..

వ్యవసాయ చట్టాల రద్దును కోరుతూ ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రైతుల ఆందోళనకు

రైతుల ఆందోళనకు మద్దతు తెలిపిన తమిళ రాజకీయ వేత్త.. ఈ విషయం గురించి ఇప్పటికే కోర్టుకు వెళ్లామని..
uppula Raju
|

Updated on: Dec 05, 2020 | 8:45 PM

Share

వ్యవసాయ చట్టాల రద్దును కోరుతూ ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రైతుల ఆందోళనకు డీఎంకే పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ మద్దతు తెలిపారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రెండ సార్లు రైతులతో చర్చలు నిర్వహించగా విఫలమయ్యాయి. తాజాగా మూడోసారి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్టాలిన్ రైతుల గురించి మాట్లాడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

తమిళనాడులోని సేలంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఇప్పటికే మేం కోర్టుకు వెళ్లామని తెలిపారు. తాను రైతు కుటుంబం నుంచి వచ్చానని ప్రధాని నరేంద్రమోదీ చెప్పుకుంటారని కానీ ఇప్పటి వరకు రైతుల గురించి ఎటువంటి చర్యలు ప్రారంభించలేదని ఆరోపించారు. ప్రధాని నిజంగా రైతు కుటుంబం నుంచి వచ్చినవాడైతే ఇప్పటికే పార్లమెంట్ సమావేశాలు ఏర్పరిచి వారికి సరైన న్యాయం చేసేవారని ఎద్దేవా చేశారు. డీఎంకే రైతుల ఆందోళనకు సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని ప్రకటించారు. అన్నం పెట్టే రైతన్నకు కనీస మద్దతు ధర కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో ఈ దేశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పది రోజులుగా రైతులు ధర్నాచేస్తుంటే పట్టించుకునే నాథుడే లేరని మండిపడ్డారు.

భారత గడ్డపై డారిల్ మిచెల్ అన్ స్టాపబుల్ రికార్డ్
భారత గడ్డపై డారిల్ మిచెల్ అన్ స్టాపబుల్ రికార్డ్
భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్!
భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్!
సిపిఐ శతాబ్ది ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం..
సిపిఐ శతాబ్ది ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం..
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చా?
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చా?
ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన నీలి రంగు పెట్టె..!
ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన నీలి రంగు పెట్టె..!
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
ఒకే బ్యాటర్ పై మూడు సార్లు అటాక్..హర్షిత్ హ్యాట్రిక్ రికార్డ్
ఒకే బ్యాటర్ పై మూడు సార్లు అటాక్..హర్షిత్ హ్యాట్రిక్ రికార్డ్
ఆలయానికి ఏ పండు తీసుకెళ్తే శుభ ప్రదం.? ఎలాంటి ఫలితం వస్తుందో..
ఆలయానికి ఏ పండు తీసుకెళ్తే శుభ ప్రదం.? ఎలాంటి ఫలితం వస్తుందో..
చికెన్ లివర్ తింటున్నారా? అయితే, ఈ విషయాలు తెలుసుకోండి
చికెన్ లివర్ తింటున్నారా? అయితే, ఈ విషయాలు తెలుసుకోండి