DMart: డీమార్ట్ దుమ్మురేపింది… మూడో త్రైమాసిక ఫలితాల్లో రూ.446.95 కోట్ల లాభం…
రిటైల్ వ్యాపార సంస్థ డీమార్ట్ మూడో త్రైమాసిక ఫలితాల్లో అదుర్స్ అనిపించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.446.95 కోట్ల...
DMart: రిటైల్ వ్యాపార సంస్థ డీమార్ట్ మూడో త్రైమాసిక ఫలితాల్లో అదుర్స్ అనిపించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.446.95 కోట్ల నికర లాభాన్ని పొందింది. కాగా గతేడాదితో పోలిస్తే డీమార్డ్ ఆదాయం మరింత పెరిగింది. నికర లాభం 16.39 శాతం మేర పెరిగినట్లు బీఎస్‌ఈ ఫైలింగ్‌లో అవెన్యూ సూపర్ మార్ట్స్ పేర్కొంది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో ఆపరేషన్స్ ద్వారా 10.77 శాతం వృద్ధితో రూ.7,542 కోట్ల ఆదాయం సముపార్జించినట్లు అవెన్యూ సూపర్‌మార్ట్స్ తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.6,808.93 కోట్లు కావడం గమనార్హం. కాగా అదే సమయంలో రూ.6,977.88 కోట్లు ఖర్చులుగా కంపెనీ చూపించింది. స్టాండలోన్ పద్ధతిలో కంపెనీ నికర లాభం 19.27 శాతం వృద్ధితో రూ.470.25 కోట్లకు చేరగా.. ఆదాయం రూ.7,432.69 కోట్లు వచ్చినట్లు కంపెనీ పేర్కొంది. కొవిడ్-19 అనంతరం ఊహించిన దానికంటే వినియోగం పెరిగిందని, పండగ అమ్మకాలు కలిసి రావడంతో కంపెనీ వ్యాపారం వృద్ధి చెందిందని అవెన్యూ సూపర్‌మార్ట్స్ సీఈవో, ఎండీ నివెల్లీ నోరోన్హా ఫలితాలనుద్దేశించి అన్నారు.