West Bengal: టీఎంసీలో చేరిన ఎంఐఎం నేత అబ్దుల్ కలామ్… మజ్లిస్‌కు షాక్… కారణం ఏంటంటే?
West Bengal: పశ్చిమ బెంగాల్‌లో ప్రభంజనం సృష్టించాలనుకుంటున్న ఎంఐఎం పార్టీకి షాక్ తగిలింది. ఆ రాష్ట్రానికి చెందిన ఎంఐఎం తాత్కాలిక అధ్యక్షుడు ఎస్‌కే అబ్దుల్
West Bengal: పశ్చిమ బెంగాల్‌లో ప్రభంజనం సృష్టించాలనుకుంటున్న ఎంఐఎం పార్టీకి షాక్ తగిలింది. ఆ రాష్ట్రానికి చెందిన ఎంఐఎం తాత్కాలిక అధ్యక్షుడు ఎస్‌కే అబ్దుల్ కలామ్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు ఆ పార్టీకి చెందిన అనేక మంది టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఏడాది బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా బెంగాల్‌లో పర్యటన చేశారు. బర్దమాన్‌లో జరిగిన బహిరంగ సభలో నడ్డా మాట్లాడుతూ బెంగాల్‌లో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఇక్కడ రైతులను ఆదుకోనున్నట్లు నడ్డా చెప్పారు. అంతకుముందు ఆయన బర్దమాన్‌లోని రాధాగోవింద్ ఆలయంలో పూజలు చేశారు. అయితే బీజేపీపై మమతా ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలకు ప్రచారాల కోసం రాష్ట్రాలు తిరుగుతున్నారు. అయితే ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతులను కలిసే ఉద్దేశం లేదని ఎద్దేవా చేశారు.
Storm Filomena : మాడ్రిడ్‌ను ముంచేస్తున్న మంచు తుఫాను.. వణికిపోతున్న స్పెయిన్ జనం