పెళ్లి వేడుకను అడ్డుకున్న అధికారిపై వేటు .. జిల్లా కలెక్టర్‌ను సస్పెండ్ చేసిన త్రిపుర సర్కార్

త్రిపురలోని వెస్ట్‌ త్రిపుర జిల్లా మేజిస్ట్రేట్‌(డీఎం)విధుల నుంచి తప్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ఓ పెళ్లిలో త్రిపుర జిల్లా మేజిస్ట్రేట్‌ దౌర్జన్యం చేసిన వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది...

పెళ్లి వేడుకను అడ్డుకున్న అధికారిపై వేటు .. జిల్లా కలెక్టర్‌ను  సస్పెండ్ చేసిన త్రిపుర సర్కార్
Disruption Of Weddings Tripura Dm Steps Down For Probe By State Government
Follow us

|

Updated on: May 04, 2021 | 6:06 PM

Tripura DM Steps Down: త్రిపురలోని వెస్ట్‌ త్రిపుర జిల్లా మేజిస్ట్రేట్‌(డీఎం)విధుల నుంచి తప్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ఓ పెళ్లిలో త్రిపుర జిల్లా మేజిస్ట్రేట్‌ దౌర్జన్యం చేసిన వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించి సోమవారం త్రిపుర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. డీఎం శైలేష్‌కుమార్‌ యాదవ్‌ను విధుల నుంచి తప్పించింది. దీనిపై రాష్ట్ర న్యాయశాఖ మంత్రి రతన్‌లాల్‌నాథ్‌ సోమవారం మాట్లాడుతూ..‘‘యాదవ్‌ రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ మనోజ్‌కుమార్‌కు ఆదివారం ఒక లేఖ రాశారు. ఏప్రిల్‌ 26వ తేదీన జరిగిన ఘటనకు సంబంధించి తనపై జరిగే విచారణ నిష్పాక్షికంగా ఉండాలనే ఉద్దేశంతో విధుల నుంచి తప్పించాలని కోరారు. దీంతో ఆ బాధ్యతలను హేమేంద్ర కుమార్‌కు అప్పగించాము’’ అని పేర్కొన్నారు.

ఇక కలెక్టర్ శైలేష్‌ కుమార్‌ యాదవ్‌ తన లేఖలో ‘‘నిస్పక్షపాత విచారణ నిమిత్తం వెస్ట్‌ త్రిపుర జిల్లా కలెక్టర్‌, డీఎం బాధ్యతల నుంచి తప్పించాల్సిందిగా కోరుతున్నాను’’ అని పేర్కొన్నట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక పేర్కొంది.

త్రిపురలో కరోనా వ్యాప్తిని నివారించేందుకు రాత్రిపూట కర్ఫ్యూని అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో పెళ్లిళ్లకు అనుమతులు ఇచ్చే అధికారాన్ని డీఎంకు కట్టబెట్టారు. బెంగళూరుకు చెందిన ఓ యువకుడు, త్రిపురకు చెందిన వధువుతో 26వ తేదీ రాత్రి పెళ్లి జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి వారు శుభలేఖతోపాటు, వినతిపత్రాన్ని డీఎం ఆఫీస్‌లో ఇచ్చి అనుమతి తీసుకొన్నారు. 26న పరిమిత అతిథులతో పెళ్లి వేడుకలు జరుగుతుండగా.. రాత్రి 10 సమయంలో డీఎం శైలేష్‌ కుమార్‌ యాదవ్‌ పోలీసులతో కలిసి కల్యాణ మండపంపై దాడి చేశారు. చాలా ఆవేశంగా కనిపించిన వారిని కొడుతూ.. అసభ్య పదజాలంతో తిడుతూ మండపాన్ని ఖాళీ చేయించారు. అడ్డొచ్చిన వారిని అరెస్టు చేయమంటూ విచ్చలవిడిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో పెళ్లికొడుకు, పురోహితుడిపై చేయి చేసుకొన్నారు. తమ వద్ద డీఎం ఆఫీస్‌ ఇచ్చిన అనుమతి ఉందని ఓ మహిళ చూపించగా.. ఆ పత్రాన్ని చింపి సినీఫక్కీలో ఆమెపై విసిరేశారు. పదుల సంఖ్యలో అతిథులను అర్ధరాత్రి వరకు పోలీసుల అదుపులో ఉంచారు. ఈ క్రమంలో ఆ ప్రాంత పోలీసులు డబ్బుకు లొంగిపోయారని ఆరోపించారు. ఈ తతంగం మొత్తం అక్కడే ఉన్న వ్యక్తులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌ అయింది. సోనూనిగమ్‌ వంటి సెలబ్రిటీలు డీఎం తీరుపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి విప్లవ్‌దేవ్‌ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఆ తర్వాత శైలేష్‌ సారీ చెప్పినట్లే చెప్పి మాట మార్చారు.

మరిన్ని చదవండి ఇక్కడ : ఓటీటీలో దుమ్మురేపుతున్న పవన్ కళ్యాణ్ వీడియో వకీల్ సాబ్ … :Vakeel Saab creates record OTT video. 

మూగజీవాలపై యాసిడ్ దాడి ..?ఏపీ లో మరో భయం! యాసిడ్ లంపి వైరస్ హడల్ వైరల్ వీడియో …

'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
మన సినిమాలను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఎవరో తెలుసా..
మన సినిమాలను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఎవరో తెలుసా..
మితిమీరిన సంబరాలతో అడ్డంగా బుక్కైన ఢిల్లీ పేసర్..!
మితిమీరిన సంబరాలతో అడ్డంగా బుక్కైన ఢిల్లీ పేసర్..!
ఏపీలో విచిత్ర వాతావరణం.. వెదర్ రిపోర్ట్ ఇదిగో.!
ఏపీలో విచిత్ర వాతావరణం.. వెదర్ రిపోర్ట్ ఇదిగో.!
వేసవిలో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా IRCTC ప్యాకేజీ
వేసవిలో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా IRCTC ప్యాకేజీ
అదరగొట్టిన కోహ్లీ, పాటిదార్.. హైదరాబాద్ టార్గెట్ 207
అదరగొట్టిన కోహ్లీ, పాటిదార్.. హైదరాబాద్ టార్గెట్ 207
Viral: చెరువు దగ్గర మట్టిలో వింత ఆకారం.. తవ్వి చూడగా.!
Viral: చెరువు దగ్గర మట్టిలో వింత ఆకారం.. తవ్వి చూడగా.!
చిరంజీవి మృగరాజు సినిమాలో ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారట..
చిరంజీవి మృగరాజు సినిమాలో ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారట..