కోవిడ్ అదుపునకు దేశవ్యాప్త లాక్ డౌన్ మేలు, ప్రధాని మోదీకి ఆలిండియా ట్రేడర్ల సంఘం అభ్యర్థన

కోవిడ్ అదుపునకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించాలని టాప్ ట్రేడర్స్ సంస్థ అయిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ అభ్యర్థించింది. ఈ మేరకు ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసింది...

  • Umakanth Rao
  • Publish Date - 4:41 pm, Tue, 4 May 21
కోవిడ్ అదుపునకు దేశవ్యాప్త లాక్ డౌన్ మేలు, ప్రధాని మోదీకి ఆలిండియా ట్రేడర్ల సంఘం అభ్యర్థన
Impose Complete Lockdown Says Confederation Of All India Traders

కోవిడ్ అదుపునకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించాలని టాప్ ట్రేడర్స్ సంస్థ అయిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ అభ్యర్థించింది. ఈ మేరకు ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసింది. ఈ ట్రాన్స్ మిషన్ చైన్ ని బ్రేక్ చేసేందుకు నేషనల్ లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారమని ఆన్ లైన్ సర్వేలో పాల్గొన్న 67 శాతం మంది అభిప్రాయపడ్డారని ఈ సంస్థ వెల్లడించింది. తక్షణమే లాక్ డౌన్ విధించాలని ఈ సంస్థ నేతలైన బీసీ. భార్తియా, ప్రవీణ్ ఖండేల్వాల్ కోరారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్  సాధ్యం కాని పక్షంలో..కరోనా వైరస్ కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఈ చర్య తీసుకోవచ్చునని వారు అన్నారు. దేశవ్యాప్త లాక్ డౌన్ విధిస్తే గతంలో మాదిరే ఈ సారి కూడా ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువుల సరఫరాకు తమ సంస్థ చర్యలు తీసుకుంటుందని వీరు వెల్లడించారు. తమ ఆన్ లైన్ సర్వేలో కూడా దేశవ్యాప్తంగా అనేకమంది ఈ ఆంక్షల పట్లే మొగ్గు చూపారని వీరు పేర్కొన్నారు.

ఢిల్లీలో కోవిడ్ ఆపరేషన్స్ ని పర్యవేక్షించేందుకు నోడల్ మినిష్టర్ గా కేంద్ర మంత్రినొకరిని నామినేట్ చేయాలనీ భార్తియా, ప్రవీణ్ ఖండేల్వాల్ సూచించారు. అమెరికాకు చెందిన ప్రముఖ నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫాసీ కూడా లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారమని అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు కూడా ఇలాగే కేంద్రానికి సూచించింది. అయితే లాన్సెట్ ఇండియా టాస్క్ ఫోర్స్ మాత్రం నేషనల్ లాక్ డౌన్ అవసరం లేదని, కఠినమైన కోవిద్ ప్రొటొకాల్స్ విధిస్తే సరిపోతుందని వ్యాఖ్యానించింది. దేశవ్యాప్త లాక్ డౌన్ వల్ల మళ్ళీ దేశ ఆర్ధిక పరిస్థితి క్షీణిస్తుందని పేర్కొంది. దేశాన్ని మూడు జోన్లుగా విభజించాలని.. తక్కువ కేసులు ఉన్న రాష్ట్రాలు, మధ్యస్థ స్థాయి, హైరిస్క్ ఉన్న రాష్ట్రాలను ఇలా జోన్లుగా విభజించి ఆ మేరకు చర్యలు తీసుకుకోవాలని ఈ బృందం సూచించింది.

మరోవైపు ప్రధాని మోదీ కూడా లాక్డౌన్ చివరి పరిష్కారమని ఇటీవల జాతి ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో స్పష్టం చేశారు.  లాక్ డౌన్ విషయంలో  తీసుకోవలసిన నిర్ణయాలను ఆయన రాష్ట్రాలకే వదిలివేశారు. ఈ కారణంగానే ఆయా రాష్ట్రాలు మినీ లాక్ డౌన్లను విధిస్తున్నాయి.

మరిన్ని చదవండి ఇక్కడ : ఓటీటీలో దుమ్మురేపుతున్న పవన్ కళ్యాణ్ వీడియో వకీల్ సాబ్ … :Vakeel Saab creates record OTT video. 

మూగజీవాలపై యాసిడ్ దాడి ..?ఏపీ లో మరో భయం! యాసిడ్ లంపి వైరస్ హడల్ వైరల్ వీడియో …