సీఎంకు కాలితో షేక్‌హ్యాండ్‌..ఎందుకో తెలుసా..?

అతడు పుట్టుకతోనే వికలాంగుడు..కానీ, అతడు వేసే పెయింగ్‌తో అద్భుతాలను సృష్టిస్తాడు…పుట్టుకతోనే రెండు చేతులు లేకుండా కాళ్లనే చేతులుగా మల్చుకుని చిత్రకళకు జీవం పోస్తున్నాడు. అంతేకాదు..అటు సమాజానికి తనవంతు సాయం కూడా చేస్తున్నాడు. ఇటీవల కేరళ రాష్ట్రంలో వచ్చిన వరదలతో నష్టపోయిన వారిని ఆదుకోవడానికి తనవంతు విరాళాన్ని అందజేసి మానవత్వం చాటుకున్నాడు. ఆ దివ్యాంగుడి పేరు ప్రణవ్‌. వయసు 22 ఏళ్లు.. స్వస్థలం కేరళలోని అలచూర్‌. అతడికి పుట్టుకతోనే  రెండు చేతులూ లేవు. అయినప్పటికీ ఈ యువకుడు తనకి […]

సీఎంకు కాలితో షేక్‌హ్యాండ్‌..ఎందుకో తెలుసా..?
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Nov 12, 2019 | 6:42 PM

అతడు పుట్టుకతోనే వికలాంగుడు..కానీ, అతడు వేసే పెయింగ్‌తో అద్భుతాలను సృష్టిస్తాడు…పుట్టుకతోనే రెండు చేతులు లేకుండా కాళ్లనే చేతులుగా మల్చుకుని చిత్రకళకు జీవం పోస్తున్నాడు. అంతేకాదు..అటు సమాజానికి తనవంతు సాయం కూడా చేస్తున్నాడు. ఇటీవల కేరళ రాష్ట్రంలో వచ్చిన వరదలతో నష్టపోయిన వారిని ఆదుకోవడానికి తనవంతు విరాళాన్ని అందజేసి మానవత్వం చాటుకున్నాడు. ఆ దివ్యాంగుడి పేరు ప్రణవ్‌. వయసు 22 ఏళ్లు.. స్వస్థలం కేరళలోని అలచూర్‌. అతడికి పుట్టుకతోనే  రెండు చేతులూ లేవు. అయినప్పటికీ ఈ యువకుడు తనకి వైకల్యం ఉందన్న విషయాన్ని మర్చిపోయి ఒక గొప్ప చిత్రకారుడుగా తయారయ్యాడు. తాను అనుకున్న దానిని సాధించాడు. పలక్కాడ్‌ జిల్లాలోని చిత్తూర్‌ ప్రభుత్వ కాలేజీలో ప్రణవ్‌ బీకామ్‌ పూర్తి చేసి ఉన్నత చదువుల చదవాలన్న కోరికతో కోచింగ్‌ తీసుకుంటున్నాడు. ప్రణవ్‌ తాజాగా మరోమారు సీఎం రిలీఫ్‌ఫండ్‌కు తన విరాళం అందజేశాడు. ఈ సందర్భంగా సీఎంను కలిశాడు. ఆ దివ్యాంగుడితో ముఖ్యమంత్రి షేక్ హ్యాండ్ చేశారు. చెయ్యి లేకపోవడంతో సీఎం అతని కాలితో చేయి కలిపి కరచాలనం చేశారు. చాలా సేపు ప్రణవ్‌తో ముచ్చటించిన సీఎం పినరయి విజయన్‌ అతని గొప్పతనాన్ని ఎంతగానో అభినందించాడు. అతడు అందజేసిన విరాళం ఎంతో విలువైనదిగా చెప్పారు. ఈ మేరకు ప్రణవ్‌ని కలిసిన విషయం సీఎం తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఫోటోలను పోస్ట్ చేశారు. దీంతో ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.