రిచెస్ట్ పార్టీ బిజెపి.. ఫండ్స్ ఎలా వచ్చాయంటే ?

దేశంలోనే అత్యంత పెద్దపార్టీగా, అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీగా రికార్డు సృష్టించిన భారతీయ జనతా పార్టీ మరో విషయంలో కూడా రికార్డుల మోత మోగిస్తోంది. సుమారు 15 కోట్లకు పైగా సాధారణ సభ్యత్వం కలిగిన ఏకైకా రాజకీయ పార్టీ దేశంలో బిజెపి ఒక్కటే. వార్డు లెవల్ వరకు పార్టీని విస్తరించిన కమలం నేతలు.. ఇంకా సభ్యత్వ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే వున్నారు. 1984లో కేవలం రెండు.. సరిగ్గా రెండంటే రెండు ఎంపీ సీట్లు కలిగి వున్న పొలిటికల్ పార్టీ […]

రిచెస్ట్ పార్టీ బిజెపి.. ఫండ్స్ ఎలా వచ్చాయంటే ?
Follow us

|

Updated on: Nov 12, 2019 | 6:24 PM

దేశంలోనే అత్యంత పెద్దపార్టీగా, అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీగా రికార్డు సృష్టించిన భారతీయ జనతా పార్టీ మరో విషయంలో కూడా రికార్డుల మోత మోగిస్తోంది. సుమారు 15 కోట్లకు పైగా సాధారణ సభ్యత్వం కలిగిన ఏకైకా రాజకీయ పార్టీ దేశంలో బిజెపి ఒక్కటే. వార్డు లెవల్ వరకు పార్టీని విస్తరించిన కమలం నేతలు.. ఇంకా సభ్యత్వ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే వున్నారు. 1984లో కేవలం రెండు.. సరిగ్గా రెండంటే రెండు ఎంపీ సీట్లు కలిగి వున్న పొలిటికల్ పార్టీ నేడు.. దేశంలోనే అతి పెద్ద పార్టీ.

కేంద్రంలో సింగిల్‌గా రెండు సార్లు లోక్‌సభలో సాధారణ మెజారిటీ సాధించిన తొలి పార్టీ కాంగ్రేసేతర పార్టీ కూడా భారతీయ జనతా పార్టీనే. నరేంద్ర మోదీ చరిష్మాని క్యాష్ చేసుకుంటూ పురోగమిస్తున్న బిజెపి మరో ఫీట్‌ను వరుసగా రెండో ఏడాది కూడా సాధించింది.

గత ఆర్థిక సంవత్సరం అంటే.. 2018-19 ఏడాదికిగాను అందిన విరాళాల వివరాలను కమలం పార్టీ వెల్లడించింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వివిధ సంస్థలు, ట్రస్టుల ద్వారా మొత్తం 700 కోట్ల రూపాయల ఫండ్స్ పార్టీకి అందినట్లు వెల్లడించారు బిజెపి నేతలు. డిజిటల్ చెల్లింపులు, చెక్కుల రూపంలోనే ఈ మొత్తం సమకూరిందని.. ఈ మొత్తమంతా వైట్ మనీనేనని బిజెపి నేతలు ఎన్నికల సంఘానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు.

బీజేపీకి వచ్చిన మొత్తం విరాళాల్లో దాదాపు సగం టాటాసన్స్‌కు సంబంధించిన ట్రస్టు నుంచే వచ్చిందని తెలుస్తోంది. టాటాసన్స్‌కు సంబంధించిన ‘ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్’ నుంచే బీజేపీకి 356కోట్ల రూపాయల ఫండ్స్ అందినట్లు సమాచారం. 20వేల రూపాయలు అంతకంటే ఎక్కువ విరాళాలను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే స్వీకరించినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. ఎలక్టోరల్ బాండ్ల నుంచి వచ్చిన విరాళాల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికలో బీజేపీ వెల్లడించకపోవడం విశేషం.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో