AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dharmasthala: ధర్మస్థల తవ్వకాల్లో కీలక మలుపు.. 13వ సైట్‌లో సెర్చ్ ఆపరేషన్..

ధర్మస్థల సామూహిక ఖననాల కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. GPRతో తనిఖీలు ప్రారంభించారు సిట్‌ అధికారులు. 6,11 ప్రదేశాల్లో అస్థిపంజరాలను గుర్తించడంతో.. ఇప్పుడు కీలకమైన 13వ నెంబర్‌ సైట్ దగ్గర సెర్చ్ ఆప‌రేష‌న్ కంటిన్యూ చేస్తున్నారు. ఆ వివరాలు ఇలా..

Dharmasthala: ధర్మస్థల తవ్వకాల్లో కీలక మలుపు.. 13వ సైట్‌లో సెర్చ్ ఆపరేషన్..
Dharmasthala News
Ravi Kiran
|

Updated on: Aug 13, 2025 | 8:57 AM

Share

దేశాన్ని విస్మయానికి గురిచేసిన కర్నాటకలోని ధర్మస్థల తవ్వకాలు కీలక మలుపు తిరిగింది. డ్రోన్‌ ఆధారిత జీపీఆర్‌ టెక్నాలజీతో వర్షంలో సెర్చింగ్‌ కంటిన్యూ అవుతోంది. అప్పటి పారిశుధ్య కార్మికుడు‌ భీమా చూపిన ప్రదేశాల్లో నేత్రావ‌తి నది ప‌రివాహ‌కంలో కీలకమైన 13వ నెంబర్‌ సైట్ దగ్గర సెర్చ్ ఆప‌రేష‌న్ కొనసాగిస్తున్నారు. భూమిలోపల మృతదేహాల అవశేషాలు గుర్తించేందుకు (GPR)గ్రౌండ్ పెన‌ట్రేటింగ్ రేడార్‌ని దించింది ప్రత్యేక దర్యాప్తు బృందం. జీపీఆర్‌తో భూమిలోకి సిగ్నల్స్‌ పంపి సెన్సర్ల ద్వారా వ‌చ్చే డేటా రికార్డ్‌ చేయనుంది. రాడార్లు ఇచ్చిన ఇన్‌ఫర్మేష‌న్‌తో 2డీ, 3డీ ఇమేజింగ్‌తో అవశేషాలపై అంచనా వేయనుంది. న‌దీపరివాహక ప్రాంతంలో భూమిలోప‌ల ఉన్న ఎలాంటి వస్తువైనా ఈ టెక్నాల‌జీ గుర్తిస్తోంది. 13వ సైట్‌లో 8 మృతదేహాలను ఖననం చేశానని విజిల్‌బ్లోయర్‌ వాంగ్మూలంతో GPR వినియోగంతో ధర్మస్థలలో సంచలనాలు బయటపడే అవకాశం ఉంది. బాహుబలి విగ్రహం ఉన్న రత్నగిరి బెట్టకు 200 మీటర్ల దూరంలో వర్షంలోనే తవ్వకాలు కొనసాగిస్తున్నారు. అయితే రత్నగిరిబెట్ట సమీప ప్రాంతాల్లో ఎక్కడినుంచో తెచ్చి కొత్తగా మట్టి పోసినట్లు గుర్తించింది సిట్‌. కొత్తగా మట్టి పోయించాల్సిన అవసరమేంటని తహశీల్దారుకు సిట్ నోటీసులు ఇచ్చింది. మట్టి పోసిన విషయం తమకు తెలీదని అధికారులు చెప్పటంతో అనుమానాలు వ్యక్తం చేస్తోంది సిట్.

సిట్‌ దర్యాప్తుతో ధర్మస్థల పరిసరాల్లో ఆత్మీయులు అదృశ్యమైన కుటుంబాల్లో ఉత్కంఠ పెరుగుతోంది. కనీసం ఆనవాళ్లయినా దొరుకుతాయేమోనని చిన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 38ఏళ్లక్రితం జరిగిన ఓ విద్యార్థిని హత్యపై పునర్విచారణకోరుతూ సిట్‌ని ఆశ్రయించింది ఆమె సోదరి. 1995 నుంచి 2014 మధ్య వందలసంఖ్యలో మహిళలు, విద్యార్థినుల మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేశానని అప్పట్లో శానిటేషన్‌ కార్మికుడిగా పనిచేసిన వ్యక్తి జూన్‌3న పోలీసులకు ఫిర్యాదుచేశాడు. విజిల్‌ బ్లోయర్‌ ఇచ్చిన సమాచారంతో పోలీసులు తవ్వకాలు చేపట్టారు. ఇప్పటిదాకా 16 వేర్వేరు ప్రదేశాల్లో తవ్వకాలు జరిగాయి. 6, 11 స్పాట్‌లలో అస్థిపంజర అవశేషాలు దొరికాయి. మరోవైపు దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే జాతీయ మానవహక్కుల కమిషన్‌ ప్రతినిధులు ధర్మస్థలలో అడుగుపెట్టారు. బెళ్తంగడిలోని సిట్ కార్యాలయానికి వచ్చి దర్యాప్తు వివరాలను తెలుసుకున్నారు. దర్యాప్తు పారదర్శకంగా ఉండాలని అధికారులకు సూచించారు. పవిత్రక్షేత్రంలో సామూహిక హత్యల ప్రచారం అబద్ధమంటున్న కర్నాటకలోని గౌరిబిదనూర్‌ బీజేపీ ఎమ్మెల్యే విశ్వనాథ్‌.. దీనికి నిరసనగా ఆగస్టు 16న యెలహంక నుంచి ధర్మస్థలదాకా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.

ఇది చదవండి: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం.. వీటిల్లో మహిళలకు ఫ్రీ జర్నీ వర్తించదు

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.