Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabarimala: శబరిమలకు భక్తుల తాకిడి.. భారీవర్షాల నేపధ్యంలో ఇబ్బందులు..

శబరిమలలో ఇబ్బందుల మధ్యలోనే భక్తుల కోలాహలం కొనసాగుతోంది. కోవిడ్ నిబంధనల నేపధ్యంలో భక్తులు అయ్యప్పను దర్శించుకోవడానికి ఉత్సాహంగా తరలి వస్తున్నారు.

Sabarimala: శబరిమలకు భక్తుల తాకిడి.. భారీవర్షాల నేపధ్యంలో ఇబ్బందులు..
Sabarimala
Follow us
KVD Varma

|

Updated on: Dec 07, 2021 | 10:15 AM

Sabarimala: శబరిమలలో ఇబ్బందుల మధ్యలోనే భక్తుల కోలాహలం కొనసాగుతోంది. కోవిడ్ నిబంధనల నేపధ్యంలో భక్తులు అయ్యప్పను దర్శించుకోవడానికి ఉత్సాహంగా తరలి వస్తున్నారు. శబరిమలలో అయ్యప్ప దర్శనానికి ఈ సంవత్సరం యాత్ర ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటివరకూ స్వామి అయ్యప్ప దర్శనాలకు వచ్చినవారి ద్వారా తొమ్మిది కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు ట్రావెన్ కోర్ బోర్డ్ వెల్లడించింది.

శబరిమలకు యాత్రీకుల తాకిడి గతం కంటే తక్కువ ఉంది. అయినప్పటికీ ఆదాయం బాగానే వసొంది అని బోర్డ్ తెలిపింది. ఇంకా అయ్యప్ప దర్శనానికి సమయం ఉన్నందున ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని బోర్డు వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కోవిడ్ మహమ్మారి నేపధ్యంలో రెండేళ్లుగా ఇతర రాష్ట్రాల నుంచి అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. కానీ, ఈసారి స్వామి భక్తులు ఎక్కువగా వస్తున్నారు.

భారీవర్షం.. శబరిమలలో రాకపోకలకు అంతరాయం..

ఇదిలా ఉండగా శబరిమలలో భారీ వర్షాల కారణంగా శబరిమలలో కమ్యూనికేషన్‌కు అంతరాయం ఏర్పడింది. ఇటీవల అక్కడ ప్రారంభించిన నూనంగర్ వంతెన కూడా దెబ్బతింది. కొండ నీటి ప్రవాహానికి వంతెన పైభాగంలో ఉన్న మెటల్‌ కొట్టుకుపోయింది. కొద్దిసేపటికే పంప కేఎస్‌ఆర్‌టీసీ సమీపంలో రోడ్డు కుంగిపోయింది. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు మౌలిక వసతులు ఒక్కొక్కటిగా కుప్పకూలాయి. సాయంత్రం, పంపాలో నీటిమట్టం ఒక్కసారిగా పెరగడంతో యాత్రికులు కాసేపు కొండ పైకి వెళ్ళడానికి ఆటంకం కలిగింది. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాతే కొండ ఎక్కేందుకు భక్తులకు అనుమతిస్తున్నారు.

ఇక అడవిలో భూమి కుంగి పోయిందనీ, పంపా డ్యామ్ షట్టర్లు ఎత్తేశారని వదంతులు రావడంతో యాత్రికులు మరింత ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో స్పష్టమైన సమాధానం లేకపోవడంతో అధికారులు సైతం కంగుతిన్నారు. అంతేకాకుండా బీఎస్ఎన్ఎల్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కూడా తెగిపోయింది. దీంతో పంపా, సన్నిధానం మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఇంటర్నెట్ అంతరాయంతో వివిధ కార్యాలయాల పనితీరుపై తీవ్ర ప్రభావం పడింది. సోమవారం మధ్యాహ్న సమయంలో కేబుల్‌ మరమ్మతులకు గురైంది. వర్షాలు బాగా పడితే శబరిమలలో కనీస సౌకర్యాలు మాత్రమే ఉన్నాయి. దీంతో అక్కడ భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇవి కూడా చదవండి: మందుబాబుల మత్తు వదల కొడతాం..ఇల్లీగల్ డీ అడిక్షన్‌ రీహాబిలిటేషన్‌ సెంటర్ల అక్రమ దందా.. టీవీ9 నిఘాలో విస్తుకొలిపే నిజాలు!

Business Idea: వాటే ఐడియా గురూ.. తండ్రి ఆసక్తి.. తనయుని వ్యాపారం.. కోట్లాది రూపాయల టర్నోవర్..

Omicron variant: ఒమిక్రాన్ వేరియంట్‌తో థర్డ్ వేవ్ వస్తుందా? కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ అంచనా..