AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delimitation Row: మాతో ఇట్టే ఉంటుంది.. కేంద్రానికి తమిళ రాజకీయ పార్టీల వార్నింగ్.. కీలక తీర్మానాలు..

పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన అంశం రాజకీయంగా అగ్గిరాజేస్తోంది. తమిళనాడు వేదికగా మొదలైన రచ్చ.. ఇంకా కొనసాగుతూనే ఉంది.. అక్కడ అధికారంలో ఉన్న డిఎంకె అఖిలపక్షం ఏర్పాటు చేసి కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటానికి సైరన్ మోగించింది. డీఎంకె పిలుపునిచ్చిన అఖిలపక్షానికి డీఎంకే ప్రధాన శత్రువైన ఏడీఎంకే, పార్టీని స్థాపించిన నాటి నుంచి డీఎంకే ని పదేపదే టార్గెట్ చేస్తున్న విజయ్ కు చెందిన టీవీకే పార్టీ కూడా హాజరవడం కీలక పరిణామంగా మారింది.

Delimitation Row: మాతో ఇట్టే ఉంటుంది.. కేంద్రానికి తమిళ రాజకీయ పార్టీల వార్నింగ్.. కీలక తీర్మానాలు..
All Party Meet In Tamil Nadu
Ch Murali
| Edited By: |

Updated on: Mar 05, 2025 | 7:31 PM

Share

పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన అంశం రాజకీయంగా అగ్గిరాజేస్తోంది. తమిళనాడు వేదికగా మొదలైన రచ్చ.. ఇంకా కొనసాగుతూనే ఉంది.. అక్కడ అధికారంలో ఉన్న డిఎంకె అఖిలపక్షం ఏర్పాటు చేసి కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటానికి సైరన్ మోగించింది. డీఎంకె పిలుపునిచ్చిన అఖిలపక్షానికి డీఎంకే ప్రధాన శత్రువైన ఏడీఎంకే, పార్టీని స్థాపించిన నాటి నుంచి డీఎంకే ని పదేపదే టార్గెట్ చేస్తున్న విజయ్ కు చెందిన టీవీకే పార్టీ కూడా హాజరవడం కీలక పరిణామంగా మారింది. నిన్న హిందీ వ్యతిరేక ఉద్యమం.. నేడు పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన అంశం.. విషయం ఏదైనా సరే ఆ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని కేంద్రాన్ని టార్గెట్ చేయడంలో తమిళనాడు ఎప్పుడు ముందుంటుంది.. తమిళనాడు సరే ఒక్కసారిగా ఉద్యమ రూపం దాల్చితే అందులో అన్ని రాజకీయ పార్టీల నుంచి ప్రజలు దాకా ఏకతాటిపైకి రావడం అనేది అనేక సందర్భాల్లో చూసిందే.. అది భాష ఉద్యమమైనా జల్లికట్టు పై నిషేధం విధించినా.. సుప్రీంకోర్టు తీర్పులను సైతం విభజించి పార్లమెంటులో ఆర్డినెన్స్ లు తెచ్చుకునేదాకా కలిసి పోరాటాలు చేసిన సందర్భాలు ఎన్నో చూసాం.. తాజాగా మరోసారి అలాంటి ఉద్యమమే జరగబోతోందా.. అంటే అవుననే వినిపిస్తోంది..

డీఎంకే నేతృత్వంలో ఏర్పాటు అయిన అఖిలపక్షం సమావేశం సూపర్ సక్సెస్ అయింది.. ఇంతకీ అఖిలపక్షం ఏర్పాటు అవ్వడానికి కారణం ఏంటి ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏంటనేది ఓసారి చూద్దాం.. వారం రోజుల క్రితం తమిళనాడు క్యాబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం స్టాలిన్ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను తగ్గించి ఉత్తరాది రాష్ట్రాల్లో పెంచుకునే కుట్ర జరుగుతోందని.. జరిగితే తమిళనాడు 8 సీట్లు వరకు తగ్గి నిధులు రాజకీయ అవకాశాల రూపంలో తమ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని కేంద్రంపై పోరాటం తప్పదని, ఆ పోరాటం అన్ని పార్టీలు కలిసి చేయాల్సిన అవసరం ఉందని అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు తేదీని ప్రకటించారు.

అయితే.. అన్ని పార్టీలు కలిసి వస్తేనే కేంద్రం మెడలు వంచగలమని స్టాలిన్ పిలుపునివ్వడంతో ఇవాళ జరిగిన అఖిలపక్షం సమావేశానికి దాదాపు 52 పార్టీలు హాజరయ్యాయి. తమిళనాడు వందకు పైగా రాజకీయ పార్టీలు ఉండగా అందులో యాక్టివ్ గా ఉన్నవి 60 వరకు రాజకీయ పార్టీలుగా చెప్పొచ్చు. డీఎంకే నేతృత్వంలో నేడు జరిగిన అఖిల పక్షం సమావేశానికి ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేకు మద్ద శత్రువైన ప్రధాన ప్రత్యర్థులు ఏడీఎంకే నుంచి కూడా ప్రతినిధులు హాజరయ్యారు.. అలాగే పార్టీని స్థాపించినప్పటి నుంచి నటుడు విజయ్ టీవీ కె అధినేత పదేపదే డిఎంకే ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. అలాంటి విజయ్ పార్టీ నుంచి కూడా ప్రతినిధి అఖిలపక్షం సమావేశానికి హాజరయ్యారు. మక్కల్ నీరుమయం అధ్యక్షుడు నటుడు కమలహాసన్ కూడా సమావేశానికి వచ్చారు. సమావేశంలో అన్ని పార్టీల ప్రతినిధులు కేంద్రం తీరును బిజెపి వ్యవహరిస్తున్న విధానాన్ని తప్పుపట్టారు.

బిజెపి తమిళనాడుకు అన్యాయం చేస్తోందని.. ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో తమిళనాడుకు మాత్రమే అత్యధిక పార్లమెంటు స్థానాలు ఉన్నాయని.. పునర్విభజనలో 8 నియోజకవర్గాలను కోతపెట్టేందుకు బిజెపి కుట్ర చేస్తోందని స్టాలిన్ పేర్కొన్నారు. అదే జరిగితే 39 స్థానాల నుంచి 31 స్థానాలకు తగ్గిపోతుందన్నారు. కాగా.. ఈ సమావేశానికి బిజెపి, నామ్ తమిళర్ కట్చి దూరంగా ఉన్నాయి..

అఖిలపక్షం కీలక తీర్మానాలు.

తమిళనాడులోని ఎంపిలు, అఖిలపక్షం లోని పార్టీల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

దక్షిణాదిన ఉన్న అన్ని రాష్ట్రాల్లోన పార్టీలను కలవాలని తీర్మానం జరిగింది..

దక్షిణాది రాష్ట్రాల పార్టీలతో కలిసి ఉమ్మడి కార్యాచరణతో కేంద్రంపై పోరాటం చేయాలని నిర్ణయం.

అంతే కాకుండా నియోజకవర్గాల పనర్విభజన జరజకూడదని డిమాండ్ చేశారు అఖిలపక్షంలోని ప్రతినిధులు. పునర్విభజన జరగడం లేదని మోడీ తో చెప్పించే లా పోరాడాలని సమావేశంలో తీర్మానం జరిగింది.

అఖిలపక్షం నిర్ణయించిన ప్రకారం కమిటీలో సభ్యులు ఎవరెవరు ఉండాలి అన్నది క్లారిటీ వచ్చాక వీలైనంత త్వరగా దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించి ముఖ్య పార్టీల అధినేతలతో చర్చించాలని నిర్ణయించారు.

ఈ ఉద్యమానికి అందరి సహకారం కోరాలని ఒక తమిళనాడుకే కాకుండా దక్షిణాదిన ఉన్న రాష్ట్రాలకు కూడా అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని చర్చించి అందరితో కలిసి ఉద్యమించాలని అఖిలపక్షం కీలకంగా నిర్ణయం తీసుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..