AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi: భోజనం వడ్డించలేదని భార్యను చంపిన భర్త.. రాత్రంతా మృతదేహంతోనే..!

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఢిల్లీలోని ఫతేపూర్ బేరీ ప్రాంతంలో ఓ భర్త మద్యం మత్తులో తన భార్యను హత్య చేశాడు.

Delhi: భోజనం వడ్డించలేదని భార్యను చంపిన భర్త.. రాత్రంతా మృతదేహంతోనే..!
Food
Shiva Prajapati
|

Updated on: Jun 19, 2022 | 5:52 AM

Share

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఢిల్లీలోని ఫతేపూర్ బేరీ ప్రాంతంలో ఓ భర్త మద్యం మత్తులో తన భార్యను హత్య చేశాడు. భోజనం వడ్డించే విషయంలో జరిగిన చిన్న వివాదమే ఈ ఘటనకు కారణం. వివరాల్లోకెళితే.. ఢిల్లీలోని ఫతేపూర్ బేరీ ప్రాంతంలో ఓ భర్త మద్యం మత్తులో భార్యను హత్య చేశాడు. భోజనం వడ్డించే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో భార్యను ఉపిరాడకుండా చేసి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. 39 ఏళ్ల సోనాలి తన భర్త 47 ఏళ్ల వినోద్ కుమార్ దూబేతో కలిసి సుల్తాన్‌పూర్‌లో నివసిస్తోంది. వారిద్దరూ 2008లో వివాహం చేసుకున్నారు. కరోనా తరువాత, వినోద్ నిరుద్యోగిగా మారాడు. గురువారం అర్థరాత్రి భార్యాభర్తలిద్దరూ కలిసి మద్యం తాగారు. ఆ తర్వాత సోనాలిని భోజనం వడ్డించమని వినోద్ కోరగా, ఆమె అందుకు నిరాకరించింది. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో.. సోనాలి గొంతును దిండుతో బిగించాడు వినోద్. దీంతో ఆమె ఆపస్మాకరస్థితిలో వెళ్లిపోయింది.

రాత్రంతా భార్యతో కలిసి నిద్రించిన అతడు ఉదయం మత్తు తగ్గడంతో ఆమెను నిద్ర లేపేందుకు ప్రయత్నించాడు. అప్పటికే ఆమె మృతి చెందడంతో ఈ విషయాన్ని వినోద్ తన స్నేహితుడికి తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వినోద్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని.. హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Follow Us
ఎల్‌నినో ఎఫెక్ట్‌.. చేతికొచ్చిన పంట కళ్లముందే ఎండిపోతుంటే..
ఎల్‌నినో ఎఫెక్ట్‌.. చేతికొచ్చిన పంట కళ్లముందే ఎండిపోతుంటే..
పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్..కడుపు నిండా తినాలంటే ఇవి పెట్టండి
పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్..కడుపు నిండా తినాలంటే ఇవి పెట్టండి
రియాద్‌ను వణికించిన క్షిపణి దాడి.. విమాన సర్వీసులు రద్దు!
రియాద్‌ను వణికించిన క్షిపణి దాడి.. విమాన సర్వీసులు రద్దు!
పూరీలు నూనె పీల్చకుండా, క్రిస్పీగా రావాలా?ఈ అద్భుతమైన చిట్కాలు
పూరీలు నూనె పీల్చకుండా, క్రిస్పీగా రావాలా?ఈ అద్భుతమైన చిట్కాలు
జెన్ జీ అమ్మాయి, ముదిరిన అబ్బాయి ! దుమ్మురేపుతున్న సినిమా
జెన్ జీ అమ్మాయి, ముదిరిన అబ్బాయి ! దుమ్మురేపుతున్న సినిమా
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
అమెరికాలో మళ్లీ ఉరిశిక్ష.. క్రిస్టా పైక్ ఘటన తర్వాత మరొకరు
అమెరికాలో మళ్లీ ఉరిశిక్ష.. క్రిస్టా పైక్ ఘటన తర్వాత మరొకరు
ఇక వాడి పనైపోయినట్లే.. దమ్మున్నోడు దొరికేశాడుగా..!
ఇక వాడి పనైపోయినట్లే.. దమ్మున్నోడు దొరికేశాడుగా..!
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్‌ చేసిన యువకుడు
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్‌ చేసిన యువకుడు