AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీ స్కూల్స్‌కు ఆగని బాంబు బెదిరింపు మెయిల్స్‌..! ఇప్పటికే నాలుగో సారి..!

ఢిల్లీలో ఈ వారంలో నాలుగోసారి బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఈ బెదిరింపులు పాఠశాలలను ఖాళీ చేయించి, విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పటికీ, బెదిరింపుల వెనుక ఉన్న వ్యక్తిని ఇంకా గుర్తించ లేదు.

ఢిల్లీ స్కూల్స్‌కు ఆగని బాంబు బెదిరింపు మెయిల్స్‌..! ఇప్పటికే నాలుగో సారి..!
Bomb Checking
Gopikrishna Meka
| Edited By: SN Pasha|

Updated on: Jul 18, 2025 | 11:10 AM

Share

దేశ రాజధాని ఢిల్లీలో స్కూల్స్‌కి బాంబు బెదిరింపులు ఆగడం లేదు. వారం రోజుల్లో నాలుగోసారి స్కూల్స్ కి ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20కి పైగా స్కూల్స్ కి బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఎక్కడి నుంచి ఈ మెయిల్స్ వస్తున్నాయి? ఎవరు పంపిస్తున్నారు? అన్నది పోలీసులు సైతం గుర్తించలేకపోవడంతో స్కూల్ యాజమాన్యాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రభుత్వ యంత్రాంగం బెదిరింపులు రాగానే ఆందోళన చెందుతున్నారు. ఈ రోజు ఢిల్లీలో 20కి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. స్కూల్ ఆవరణలో పేలుడు పదార్థాలు అమర్చామని, బెదిరింపును లెక్కచేయకుంటే పిల్లలు ముక్కలవుతారని ఈమెయిల్ లో అగంతకులు పేర్కొన్నారు. రోహిణి సెక్టార్ 3 లోని అభినవ్ పబ్లిక్ స్కూల్, పశ్చిమ విహార్ లోని రిచ్మండ్ గ్లోబల్ స్కూల్ కి ఈమెయిల్స్ వచ్చాయి. వెంటనే స్కూల్ యాజమాన్యాలు పిల్లలను ఇంటికి పంపి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు, బాంబు స్క్వార్డ్స్, అగ్నిమాపక సిబ్బంది, సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి ఏమీ లేదని తేల్చారు.

బాంబు బెదిరింపు మెయిల్‌లో ఏముందంటే..?

ఢిల్లీలో పాఠశాలలు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతాయి. అయితే బెదిరింపు ఈ మెయిల్స్ ఉదయం 5.26 గంటల నుంచి 8.12 గంటల మధ్య ఈ-మెయిల్స్ వస్తున్నాయి. ఆ ఈమెయిల్ లో బెదిరించే వ్యక్తి నేను పాఠశాల తరగతి గదుల్లో అనేక పేలుడు పరికరాలను (ట్రినిట్రోటోలుయెన్) ఉంచానని, పేలుడు పదార్థాలను నల్లటి ప్లాస్టిక్ సంచులలో దాచిపెట్టనాన్ని పేర్కొంటున్నారు. మీలో ప్రతి ఒక్కరినీ ఈ ప్రపంచం నుండి తుడిచివేస్తాను. ఒక్కరు కూడా బతికి ఉండటానికి వీల్లేదు. నేను మీ చావు వార్తలు చూసినప్పుడు సంతోషంగా నవ్వుతాను, తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి వారి పిల్లల శరీర భాగాలు ముక్కలు ముక్కలుగా పడి ఉండటం నేను చూస్తాను. మీరందరూ బాధపడటానికి అర్హులు.

నాకు నిజంగా నా జీవితం అసహ్యకరం, పేలుడు వార్త తర్వాత నేను ఆత్మహత్య చేసుకుంటాను, నా గొంతు కోసుకుంటాను, నా మణికట్టును కోసుకుంటాను. మనోరోగ వైద్యులు, మనస్తత్వవేత్తలు, ఎవరూ నన్ను పట్టించుకోలేదు, ఎవరూ పట్టించుకోరు. మీరు నిస్సహాయంగా ఉన్న మనుషులకు మందులు ఇవ్వడం గురించి మాత్రమే శ్రద్ధ చూపిస్తారు, ఆ మందులు మీ అవయవాలను నాశనం చేస్తాయని లేదా అవి అసహ్యకరమైన బరువు పెరగడానికి కారణమవుతాయని మనోరోగ వైద్యులు మీకు ఎప్పుడూ చెప్పరు. మానసిక మందులు రోగులకు సహాయపడతాయని మానసిక వైద్యులు ప్రజలను ఆలోచించేలా చేస్తారు. మానసిక వైద్యులు సరైన రీతిలో వైద్యసాయం చేయరని చెప్పడానికి నేను ప్రత్యక్ష రుజువు. మీరు నాలాగే బాధపడటానికి అర్హులు అంటూ ఈ మెయిల్ లో ఉందని పోలీసులు వెల్లడించారు.

వారంలో నాలుగోసారి స్కూళ్లకు బాంబు బెదిరింపులు

ఈ వారంలో ఢిల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం ఇది నాలుగోసారి. జూలై 16న ఎనిమిది పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. గత వారం రోజుల్లో ఢిల్లీలోని 28 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. వసుస బాంబు బెదిరింపులు స్కూల్ యాజమాన్యాలు, విద్యార్థులు, తల్లిదండ్రులను, పరిపాలనా వ్యవస్థలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. బంబు బెదిరింపులు వచ్చిన వెంటనే విద్యార్థులను స్కూల్ నుంచి ఖాళీ చేయిస్తున్నారు. తల్లిదండ్రులు సమాచారం అందగానే హుటాహుటిన స్కూల్ కి చేరుకుని పిల్లలను ఇళ్లకు తీసుకెళ్తున్నారు. ఢిల్లీ పోలీసులు, బాంబు నిర్వీర్య దళం, డాగ్ స్క్వాడ్, అగ్నిమాపక సిబ్బంది సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో బాంబు లేదని తేలిన తరువాత ఊపిరి పీల్చుకుంటున్నారు. వసంత్ కుంజ్‌లోని వసంత్ వ్యాలీ స్కూల్, హౌజ్ ఖాస్‌లోని మదర్ ఇంటర్నేషనల్, పశ్చిమ్ విహార్‌లోని రిచ్‌మండ్ గ్లోబల్ స్కూల్, పశ్చిమ్ విహార్, పితంపురాలోని ప్రుడెన్స్ స్కూల్, లోధి ఎస్టేట్‌లోని సర్దార్ పటేల్ విద్యాలయం, పశ్చిమ్ విహార్‌లోని సెయింట్ థామస్ స్కూల్ కి బాంబు బెదిరింపులు వచ్చాయి

ఒక విద్యార్థి అరెస్ట్

జూలై 15న ద్వారకలోని సెయింట్ థామస్ స్కూల్‌కు బాంబు బెదిరింపు పంపినందుకు 12 ఏళ్ల విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మంగళవారం బాంబు బెదిరింపు ఈ-మెయిల్ పంపినందుకు బాలుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ద్వారక) అంకిత్ సింగ్ తెలిపారు. అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

కేంద్ర హోంశాఖ సీరియస్

ఢిల్లీలో స్కూల్స్ కి వస్తున్న బాంబు బెదిరింపులపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఐపీ అడ్రస్ లు మార్చడం, డార్క్ వెబ్ ద్వారా ఈమెయిల్స్ పంపడంతో ఫేక్ బాంబు బెదిరింపులకు పాల్పడుతున్న వారిని పట్టుకోవడం కష్టతరంగా మారింది. ఫేక్ బాంబు బెదిరింపు ఈ మెయిల్ ఢిల్లీ శాంతి భద్రతలకు సంబంధించిన కీలక అంశం కావడంతో కేంద్ర హోంశాఖ దీనిపై సీరియస్ గా దృష్టి సారించింది. వరుస బాంబు ఈ మెయిల్స్ పై సమగ్ర జరపాలని ఢిల్లీ పోలీసులను హోంశాఖ ఆదేశించింది. ప్రస్తుతం ఫేక్ ఈమెయిల్ బాంబు బెదిరింపులపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి