AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Startup Culture: స్టార్టప్‌ కల్చర్‌లో టెకీల కష్టాలు మీరెప్పుడైనా విన్నారా..? వర్క్ బారెడు.. జీతం బెత్తెడు!

స్టార్టప్ రాజధాని బెంగళూరు ట్రాఫిక్‌ చిక్కులకు మాత్రమే కాదు ఇప్పుడు ఉద్యోగుల కష్టాలకు ఫేమస్‌గా మారింది. ఇదొక స్టార్టప్ బజ్‌వర్డ్‌గా వినిపిస్తుంది. అయితే ఓ లింక్డ్ఇన్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. స్టారప్‌లలో పనిచేసే ఇంటర్న్‌ల కష్టాలు ఈ పోస్టు వెలుగులోకి తీసుకువచ్చింది. 'హస్టిల్ కల్చర్' ఫౌండర్ల విజయాలను కీర్తిస్తూ ఉన్న ఈ కంటెంట్ బెంగళూరుకు చెందిన ఫౌండర్ శుభం లోండే పోస్టు చేశాడు. ఇంతకీ అందులో ఏముందంటే..

Startup Culture: స్టార్టప్‌ కల్చర్‌లో టెకీల కష్టాలు మీరెప్పుడైనా విన్నారా..? వర్క్ బారెడు.. జీతం బెత్తెడు!
Bengaluru Startup Culture
Srilakshmi C
|

Updated on: Jul 18, 2025 | 12:09 PM

Share

బెంగళూరు, జూలై 18: ‘బెంగళూరు టెక్ లైఫ్’ అనే శీర్షికతో బెంగళూరుకు చెందిన ఫౌండర్ శుభం లోండే చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. స్టార్టప్ వ్యవస్థాపకులు, వారి వద్ద గొడ్డు చాకిరీ చేసే ఇంటర్న్‌ల మధ్య ఉన్న అంతరాన్ని ఈ పోస్టు వెల్లడించింది. జీతం పరంగానే కాకుండా, పర్యావరణ వ్యవస్థలో విలువ, కృషి ఎలా గుర్తించబడుతున్నాయి అనే విషయాలను వెల్లడించారు. ఒక ఫౌండర్‌ నెలకు రూ. 5 లక్షలు సంపాదిస్తాడు. కానీ అతని వద్ద పనిచేసే ఇంటర్న్ మాత్రం కేవలం రూ.15 వేల స్టైఫండ్ మాత్రమే తీసుకుంటాడు. అయినప్పటికీ ఇంటర్న్‌పై ఉంచే పని ఒత్తిడిలో మార్పు ఉండదు. స్టారప్‌లు ఇప్పటికీ ముందుకు సాగుతూనే ఉన్నాయి. కానీ ఆ హడావిడి కింద సమిష్టి అలసట దాగి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫౌండర్‌ ఉదయం తెల్లవారుజామున 2 గంటలకు అత్యవసర పరిష్కారం కోరుతూ వాయిస్ నోట్ పంపితే.. ఇంటర్న్‌లు చస్తూ బతుకుతూ త్వరితగతిన సొల్యూషన్‌ పంపుతారు. ఇప్పటికే పిచ్ డెక్‌లను నిర్వహించడం, కనీస ఆచరణీయ ఉత్పత్తులను ఒంటరిగా నిర్మించడం, వారాంతాల్లో కస్టమర్ మద్దతును నిర్వహించడం.. ఇవన్నీ ఇంటర్న్‌కు ‘హస్టిల్ మైండ్‌సెట్’ లేదని చెప్పకనే చెబుతోంది.

లక్షలాది మంది వ్యవస్థాపకులు 5 మిలియన్ల డాలర్లు సేకరించి, ఫోర్బ్స్ వంటి అద్భుతమైన ఫీచర్లు, వ్యాపార పత్రికలలో ప్రొఫైల్ ప్రకటిస్తారు. కానీ గొడ్డు చాకిరీ చేసే ఇంటర్న్‌కు ఇచ్చే బహుమతి చాలా స్వల్పంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ పోస్ట్‌ బెంగళూరు నగర కార్మికులను వేధిస్తున్న మూడు ప్రధాన ఆందోళనలను ప్రస్తావించింది. మారతహళ్లి వంతెనపై గడిపిన అంతులేని గంటలు, ఆకస్మిక నిద్రకు దారితీసే పరిపూర్ణ వాతావరణం- మోసపూరిత ప్రశాంతత, సాయంత్రం 6 తర్వాత ఆటోల కోసం వేటాడే గందరగోళం.

మారతహళ్లి బ్రిడ్జి సిండ్రోమ్ గురించి చెబుతూ.. నగరంలో జనాలు తమ ఇళ్లలో కంటే ఇక్కడే ట్రాఫిక్ లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. జీవితంలో విజయం సాధించాలంటే చాలా వంతెనలు దాటాలి అని పెద్దలు చెబుతుంటారు. మారతహళ్లి బ్రిడ్జి వాటిల్లో ఒకటి. కాకపోతే దీన్ని రోజుకు రెండుసార్లు దీనిని దాటాలి. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంచడానికి కొందరు ఏకంగా ఇక్కడ స్లాట్‌ను బ్లాక్ చేస్తున్నారు. అన్నింటికంటే దారుణమైన విషయం ఏంటంటే.. సాయంత్రం 6 గంటల తర్వాత ఇక్కడ ఆటోలు కనిపించకపోవడం. ఇక్కడ ఆటో డ్రైవర్లు అనధికారిక జీవిత శిక్షకులు. ఈ గందరగోళాల మధ్య ఇంటర్న్ లా జీవితం నరకప్రాయంగా ఉంటోందని సదరు పోస్టులో వివరించాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.