‘ఐ-20 కారులో పేలుడు.. ప్రతి కోణాన్ని పరిశీలిస్తాము’: హోంమంత్రి అమిత్ షా
ఢిల్లీ బ్లాస్ట్ సంఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఈ ఘటనలో కొంతమంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు ఫోన్ చేసి, ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నట్లు అమిత్ వెల్లడించారు. క్షతగాత్రులను పరామర్శించేందుకు వెళ్తున్నట్లు తెలిపారు. సమీపంలోని అన్ని సిసిటివి కెమెరాలను పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.

ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో జరిగిన పేలుడులో 8 మంది మరణించారు. ఇంకా చాలా మంది గాయపడ్డారు. LNJP ఆసుపత్రి ప్రకారం, 15 మందిని చికిత్స కోసం తీసుకువచ్చారు. గాయపడ్డ వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు, పేలుడు జరిగిన వెంటనే ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ఈ సంఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఈ ఘటనలో కొంతమంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు ఫోన్ చేసి, ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నట్లు అమిత్ వెల్లడించారు. క్షతగాత్రులను పరామర్శించేందుకు వెళ్తున్నట్లు తెలిపారు. సమీపంలోని అన్ని సిసిటివి కెమెరాలను పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.
#WATCH | Delhi: Blast near Red Fort Metro Station | Union Home Minister Amit Shah says "This evening, around 7 pm, a blast occurred in a Hyundai i20 car at the Subhash Marg traffic signal near the Red Fort in Delhi. The blast injured some pedestrians and damaged some vehicles.… pic.twitter.com/BfRei3r3tx
— ANI (@ANI) November 10, 2025
“ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద హ్యుందాయ్ ఐ20 కారు పేలిపోయింది. ఈ పేలుడులో కొంతమంది పాదచారులు గాయపడ్డారు. కొన్ని వాహనాలు దెబ్బతిన్నాయి. కొంతమంది ప్రాణాలు కోల్పోయారని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. పేలుడు గురించి సమాచారం అందిన 10 నిమిషాల్లోనే , ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి” అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రమాదస్థలిని స్వయంగా పరిశీలిచిన హోంమంత్రి అమిత్ షా, అనంతరం క్షతగాత్రులను పరామర్శించారు.
#WATCH | Delhi: Blast near Red Fort Metro Station | Union Home Minister Amit Shah reaches Lok Nayak Hospital pic.twitter.com/fsEEikPh25
— ANI (@ANI) November 10, 2025
ఈ సంఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత, ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా కీలక ప్రకటన చేశారు. “సోమవారం (నవంబర్ 10, 2025) సాయంత్రం 6:52 గంటల ప్రాంతంలో, నెమ్మదిగా వెళ్తున్న ఐ20 కారు వాహనం రెడ్ లైట్ వద్ద ఆగిపోయింది. వెంటనే వాహనంలో పేలుడు సంభవించింది. దీంతో సమీపంలోని వాహనాలు దెబ్బతిన్నాయి. FSL, NIA, NSGతో సహా అన్ని ఏజెన్సీలు అక్కడ ఉన్నాయి. పేలుడు తర్వాత, ఢిల్లీ పోలీసులు మొత్తం నగరానికి హై అలర్ట్ జారీ చేశారు. ఢిల్లీ అగ్నిమాపక శాఖ ప్రకారం, ఏడు అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. పోలీసులు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. పేలుడు చాలా శక్తివంతమైనదని, అనేక మీటర్ల దూరంలో పార్క్ చేసిన వాహనాల ధ్వంసమయ్యాయి. రద్దీగా ఉండే ప్రాంతంలోని చుట్టుపక్కల భవనాలకు వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
“రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో ఆపి ఉంచిన కారులో పేలుడు సంభవించింది. దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. చాలా మంది గాయపడినట్లు భావిస్తున్నారు” అని ఢిల్లీ అగ్నిమాపక శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పేలుడు దృశ్యాలలో కాలిపోతున్న కార్ల నుండి మంటలు, పొగలు పెరుగుతున్నట్లు కనిపించాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




