బిగ్ ఫైట్, కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు షో కాజ్ నోటీసు జారీ, కోర్టు ధిక్కార చర్యలకు సన్నాహాలు,

ఢిల్లీలో ఆక్సిజన్ కొరతను నివారించేందుకు సరైన చర్యలు తీసుకోలేదంటూ ఢిల్లీ హైకోర్టు మంగళవారం కేంద్రానికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మీపై కోర్టు ధిక్కార ప్రొసీడింగ్స్ ఎందుకు చేపట్టరాదో...

  • Umakanth Rao
  • Publish Date - 8:18 pm, Tue, 4 May 21
బిగ్ ఫైట్, కేంద్రానికి  ఢిల్లీ హైకోర్టు షో కాజ్ నోటీసు జారీ, కోర్టు ధిక్కార చర్యలకు సన్నాహాలు,
Delhi Highcourt Issues Show Cause Notice To Centre

ఢిల్లీలో ఆక్సిజన్ కొరతను నివారించేందుకు సరైన చర్యలు తీసుకోలేదంటూ ఢిల్లీ హైకోర్టు మంగళవారం కేంద్రానికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మీపై కోర్టు ధిక్కార ప్రొసీడింగ్స్ ఎందుకు చేపట్టరాదో వివరించాలని ఈ  నోటీసుల్లో కోరింది. కేటాయించిన ఆక్సిజన్ తమకు ఇంకా అందలేదని ఢిల్లీ ప్రభుత్వం చెబుతోందని, అసలు ఆక్సిజన్ సప్లయ్ లో మీరు ఎందుకు నిరాసక్తంగా ఉంటున్నారని కోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టులో రేపు మీరు అఫిడవిట్ దాఖలు చేస్తామని చెబుతున్నారని, కానీ ఇంత అత్యవసరంగా ఆక్సిజన్ అవసరమైన సందర్భంలో అఫిడవిట్ దాఖలు వల్ల ప్రయోజనం ఉందా అని అభిప్రాయపడింది. ఒక్క రోజులో ఆక్సిజన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని, మీకు వచ్చిన సమస్య ఏమిటని కూడా న్యాయమూర్తులు ప్రశ్నించారు. నగరానికి 700 మెట్రిక్ టన్నులు అవసరమని సుప్రీంకోర్టు ఆదేశించలేదని కేంద్రం తెలియజేయగా.. మీతో మేము ఏకీభవించబోమని వారన్నారు. రోజుకు 700 టన్నులు ఆక్సిజన్ ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టంగా చెప్పిందని కోర్టు పేర్కొంది. మీరు సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీ నెరవేరడంలేదు అని తీవ్రంగా వ్యాఖ్యానించింది. తాము రోజూ నగరంలోని ఆస్పత్జ్రులు, నర్సింగ్ హోమ్ ల పరిస్థితి చూస్తున్నామని, అత్యవసర ఆక్సిజన్ సప్లయ్ కోసం అవి ఎదురు చూస్తున్నాయని న్యాయమూర్తులు అన్నారు. ప్రాణవాయువుతో బాటు రోగులు బెడ్స్ కూడా లభించక అల్లాడుతున్నారని ఇక ఇలా అయితే హాస్పిటల్స్ తప్పనిసరిగా తమ బెడ్స్ సంఖ్యను తగ్గించుకోవలసి ఉంటుందని వారు పేర్కొన్నారు. అలాంటప్పుడు రోగుల పరిస్థితి ఏమిటన్నారు.

ఇన్ని రోజులైనా కేంద్రం ఎందుకు ఇలా జాప్యం చేస్తోందో అర్థం కావడంలేదని, సుప్రీంకోర్టు అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తోందని  కూడా ఢిల్లీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఒకవేళ కోర్టు ధిక్కార చర్యలు చేపడితే కేంద్రం చిక్కులను ఎదుర్కోవచ్చు. అయితే  సుప్రీంకోర్టు  ఈ విధమైన నిర్ణయం తీసుకోబోదని కేంద్రం భావిస్తోంది.

Delhi Highcourt Issues Show Cause Notice To Centre 2

Delhi Highcourt Issues Show Cause Notice To Centre 2

మరిన్ని చదవండి ఇక్కడ : సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తున్న గున్న ఏనుగు..వావ్ అంటున్న నెటిజెన్లు..: Elephant Viral Video.

ఓటీటీలో దుమ్మురేపుతున్న పవన్ కళ్యాణ్ వీడియో వకీల్ సాబ్ … :Vakeel Saab creates record OTT video.