Delhi Election 2025 Results Live Streaming: ఢిల్లీ అధికార పీఠం ఎవరిది..? మళ్లీ చీపురు ఊడ్చేస్తుందా.. కమలం వికసిస్తుందా..?
Delhi Assembly Election 2025 Results Live Streaming: ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు 699 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీలో ఉన్నప్పటికీ ప్రధాన పోరు మాత్రం అధికార ఆప్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్యే జరిగింది. Watch Delhi Election Results Live Trends టీవీ9లో చూడండి..

Delhi Assembly Election 2025 Results Live Streaming: కౌన్ బనేగా ఢిల్లీ సీఎం.. మళ్లీ చీపురు పార్టీ అధికారంలోకి వస్తుందా…? లేక భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేస్తుందా..? కాంగ్రెస్ ప్రభావమెంత..? ఎగ్జిట్ పోల్స్.. ఓటరు పల్స్ పట్టే రిపోర్ట్ ఇచ్చాయా..? బీజేపీ 27 ఏళ్ల తర్వాత దేశ రాజధాని ఢిల్లీ మళ్లీ అధికార పగ్గాలు చేపడుతుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా..? ఏపార్టీ అధికారంలోకి రానుంది.. ఇలా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం.. వెంటనే ఫలితాలు..
శనివారం ఉదయం 8 గంటల నుంచి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది.. ముందుగా బ్యాలెట్ పేపర్లను కౌంట్ చేయనున్నారు. ఉదయం 9 గంటలకు ట్రెండ్స్.. 10 గంటల నుంచి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లైవ్ వీడియోలో చూడండి..
రికార్డు స్థాయిలో పోలింగ్.. 60.42% ఓటింగ్..
కాగా.. ఫిబ్రవరి 5న బుధవారం 70 స్థానాలకు ఎన్నికలు జరగగా.. 699 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. భారత ఎన్నికల సంఘం (ECI) విడుదల చేసిన గణాంకాల ప్రకారం బుధవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో 60.42% ఓటర్లు ఓటు వేశారు. రికార్డు స్థాయిలో ఓట్లు పోలయ్యాయి..
70 స్థానాలు.. 36 గెలవాల్సిందే..
మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 36 స్థానాలు గెలవాలి. ఈ ఎన్నికల్లో బీజేపీదే పైచేయి అని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉందని తెలిపాయి. కాంగ్రెస్ అతి తక్కువ స్థానాల్లో ఆధిక్యం చూపే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి..
బీజేపీ వర్సెస్ ఆప్..
అయితే.. ఓట్ల శాతం పెరగడంతో ఆయా పార్టీలు అంచనాలను బేరీజు వేసుకుంటున్నాయి.. పెరిగిన ఓట్ల శాతం అనుకూలంగా ఉంటుందా..? లేక ప్రతికూలంగా మారుతుందా..? ఎగ్జిట్ పోల్స్ పల్స్ నిజమేనా.. అని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), భారతీయ జనతా పార్టీ (BJP), కాంగ్రెస్ అంచనాలు వేసుకుంటున్నాయి.. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య నెక్ టు నెక్ ఫైట్ జరగనుంది. ఈ క్రమంలో హంగ్ కూడా ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు..
బీజేపీ .. ఆప్ మధ్య గట్టి పోరు నేపథ్యంలో .. ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉండనున్నాయి.. ఢిల్లీ పీఠం పై ఎవరు జెండా ఎగురవేస్తారనేది.. ప్రస్తుతం ఉత్కంఠగా మారింది..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..