
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేటి విచారణకు గైర్హాజరు అయ్యారు. అయితే ఈనెల 21న మద్యం కుంభకోణం కేసులో విచారణకు హాజరుకావాలని సోమవారం నాడు కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ ముఖ్యమంత్రి విచారణకు హాజరు కాకపోవడం వెనుక అనేక వార్తలు వినిపిస్తున్నప్పటికీ అసలు కారణం ఇదే అంటున్నారు ఆప్ నేతలు. ప్రస్తుతం ఆప్ అధినేత విపాసన ధ్యానం కోర్సులో చేరినట్లు తెలిపారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా. ఈ కోర్సు నేటి నుంచి 10 రోజుల పాటూ ఉంటుందని చెప్పారు. డిశంబర్ 30తో విపాసన ధ్యానం కోర్సు ముగుస్తుందని చెప్పుకొచ్చారు.
శీతాకాలం కారణంగా ప్రతి ఏడాది ఈ విసాసన మెడిటేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు కేజ్రీవాల్. గతంలో కూడా బెంగళూరు, జైపూర్ వంటి నగరాల్లో ఈ కోర్సులో శిక్షణ పొందేందుకు వెళ్లారు. అయితే ఈ ఏడాది ఎక్కడ ప్లాన్ చేశారన్న వివరాలు మాత్రం తెలియలేదు. ఈడీ విచారణకు హాజరు కాకపోవడానికి అసలు కారణం ఇదేనని వెల్లడించారు పార్టీ ముఖ్య నేతలు. ఈ యోగా కార్యక్రమం ఈడీ నోటీసుల కంటే ముందుగానే నిర్ణయించినది తెలిపారు. హాజరుకాకపోవడం వెనుక ఏవైనా చట్టపరమైన సమస్యలు తలెత్తితే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని ఎంపీ రాఘవ్ చద్దా స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే గతంలో కూడా ఈడీ నోటీసులపై స్పందించలేదు కేజ్రీవాల్. మద్యం కేసులో ఏడాది కాలంగా కేజ్రీవాల్‌ను విచారిస్తోంది ఈడీ.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..