Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: అమెరికా చేసిన హత్య కుట్ర ఆరోపణలపై తొలిసారిగా స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ

అమెరికాలో ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు భారతీయుడు కుట్ర పన్నాడని కొద్ది రోజుల క్రితం అమెరికా మీడియాలో కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు. భారత పౌరుడు ఏదైనా మంచి లేదా చెడు చేసినట్లయితే, మేము పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

PM Modi: అమెరికా చేసిన హత్య కుట్ర ఆరోపణలపై తొలిసారిగా స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ
Narendra Modi On Us
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 20, 2023 | 12:27 PM

అమెరికాలో ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు భారతీయుడు కుట్ర పన్నాడని కొద్ది రోజుల క్రితం అమెరికా మీడియాలో కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం సబబు కాదని స్పష్టం చేశారు. సాక్ష్యాలు ఉంటే తప్పకుండా శిక్షిస్తామన్నారు. తాజాగా ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన విషయం వెల్లడించారు.

ఈ నేపథ్యంలోనే అమెరికా నేరారోపణను ప్రధాని మోదీ ఖండించారు. ఈ వ్యవహారంలో దౌత్యపరమైన ప్రభావాన్ని తగ్గించడానికి భారత ప్రధాని ప్రయత్నించారు. “ఏదైనా సాక్ష్యాలను పరిశీలిస్తాను కానీ తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు”. ఇలాంటి ఘటనలు అమెరికా-భారత్‌ సంబంధాలను దెబ్బతీస్తుందన్నారు మోదీ. ఎవరైనా మాకు ఏదైనా సమాచారం ఇస్తే తప్పకుండా పరిశీలిస్తామని మోదీ అన్నారు. “ భారత పౌరుడు ఏదైనా మంచి లేదా చెడు చేసినట్లయితే, మేము దానిని పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నాము. మా నిబద్ధత చట్ట పాలనపై ఉంది. ” అని స్పష్టం చేశారు.

అమెరికాలో ఉగ్రవాది పన్నూ హత్య కుట్రకు సంబంధించి అభియోగాలతో నిఖిల్ గుప్తా అనే భారత సంతతికి చెందిన వ్యక్తిని చెక్ రిపబ్లిక్ అధికారులు అరెస్ట్ చేశారు. హత్య కుట్రను అమెరికా భగ్నం చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. అమెరికన్ అధికారుల ఒత్తిడి మేరకు చెక్ రిపబ్లికన్ అధికారులు ఆ దేశంలో నిఖిల్ గుప్తాను అరెస్టు చేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు నిఖిల్ గుప్తా కుటుంబం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. భారత ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరింది. ఈ నేపథ్యంలో భారత్ అమెరికా సంబంధాలపై ప్రభావం చూపిస్తుందని యూఎస్ కాంగ్రెస్ లోని భారతీయ అమెరికన్ చట్ట సభ సభ్యులు హెచ్చరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..