AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arvind Kejriwal: లిక్కర్ స్కామ్‌లో సీబీఐ ముందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌.. ఆప్ కార్యాలయానికి తరలివస్తున్న పార్టీ శ్రేణులు..

లిక్కర్ స్కామ్‌లో ఇవాళ సీబీఐ విచారణకు హాజరుకానున్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయి జైల్లో ఉన్నారు మాజీ మంత్రి మనీశ్‌ సిసోడియా. ఇవాళ కేజ్రీవాల్‌ విచారణకు హాజరు అవుతుండటంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. మొదటిసారి ఒక ముఖ్యమంత్రి విచారణకు హాజరుకావడంపై ఢిల్లీ అంతటా ఉత్కంఠ నెల‌కొంది.

Arvind Kejriwal: లిక్కర్ స్కామ్‌లో సీబీఐ ముందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌.. ఆప్ కార్యాలయానికి తరలివస్తున్న పార్టీ శ్రేణులు..
Arvind Kejriwal
Sanjay Kasula
|

Updated on: Apr 16, 2023 | 8:56 AM

Share

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇవాళ సీబీఐ ముందు హాజరుకానున్నారు. ఢిల్లీ లిక్కర్‌ కేసులో కేజ్రీవాల్‌ విచారించనున్నారు. దీంతో ఆయనకు నోటీసులు జారీ చేసి ఆదివారం ఉదయం 11 గంటలకు విచారణకు పిలిచింది సీబీఐ. ఇప్పటికే పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ ప్రభుత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీకి చెందిన సీనియర్ మంత్రులు, లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో కలిసి కేజ్రివాల్ సీబీఐ ప్రధాన కార్యాలయానికి వెళ్లనున్నట్లు సమాచారం. సరిగ్గా అదే దృశ్యం ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సీబీఐ ప్రధాన కార్యాలయానికి వెళ్లే సమయంలో కూడా కనిపించింది. అక్కడ గంటల తరబడి విచారణ తర్వాత అరెస్టు చేశారు. ఆ రోజు నుంచి మనీష్ సిసోడియా జైల్లోనే ఉన్నారు. సిసోసిడియా  కోర్టు నుంచి బెయిల్ పొందలేకపోయారు.

ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం మీడియాతో మాట్లాడుతూ మద్యం కుంభకోణం జరగలేదన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలను కస్టడీలో ఉన్న వ్యక్తులను చిత్రహింసలకు గురిచేసి, కోర్టులో తప్పుడు సాక్ష్యాలను సమర్పించిందన్నారు. మనీష్ సిసోడియా 10 ఫోన్లను ధ్వంసం చేశారని కొద్ది రోజుల క్రితం ఈడీ కోర్టుకు తెలిపింది. ఇప్పుడు ఏజెన్సీ ఒక నివేదికను విడుదల చేసింది. అందులో 5 ఫోన్లను ED స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిందన్నారు. ఇప్పుడు కోర్టులో తప్పుడు సాక్ష్యాలు చూపించినందుకు ఈడీపై కేసు పెడతానని సీఎం కేజ్రీవాల్ అన్నారు. దేశ ప్రజలకు కొత్త ఆశాకిరణంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భవించిందని, దీన్ని ప్రధాని, బీజేపీ జీర్ణించుకోలేకపోతున్నాయని ఆరోపించారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్.. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఎక్కడ చూసినా.. ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తోంది. ఇందులో పెద్ద తలకాయలు ఉండటంతో మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఈ కుంభకోణం బయటికి రావడం పెను సంచలనంగా మారిందిం. అసలేం జరిగిందో నిగ్గు తేల్చేందుకు ఒకేసారి సీబీఐ, ఈడీ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ స్కామ్‌లో నిందితులు, అనుమానితులను అదుపులోనికి తీసుకుని ఈడీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. లిక్కర్ పాలసీ ఏంటి..? స్కామ్‌గా ఎలా మారింది..? ఇందులో ఎవరెవరు ఉన్నారు..? సూత్రధారులెవరు..? పాత్రధారులెవరు..? విషయాలన్నీ ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. విజయ్ నాయర్‌ అరెస్ట్‌తో మొదలైన ఈ వ్యవహారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు నోటీసుల దాకా వచ్చింది.

లిక్కర్ స్కామ్‌ కేసులో ఎమ్మెల్సీ కవితను ఇప్పటికే ఈడీ విచారించింది. లేటెస్ట్‌గా సీబీఐ సమన్లు అందుకున్న కేజ్రీవాల్‌ ఈ కేసులో విచారణకు హాజరు అవుతుండటంతో ఏం జరగనుందోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. మొదటిసారి ఒక ముఖ్యమంత్రి విచారణకు హాజరుకావడంపై ఢిల్లీ అంతటా ఉత్కంఠ నెల‌కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం

Follow Us