CM Kejriwal: ఢిల్లీలో రాజకీయాలు భగ్గుమంటున్నాయి. కేజ్రీవాల్ కాశ్మీర్ అంశంపై రాజకీయ రగడ రాజుకుంటోంది. కేజ్రీవాల్ సర్కార్ కేంద్రంపై సంచలన ఆరోపణలు చేస్తోంది. కేంద్రం కశ్మీర్ సమస్యను పరిష్కరించలేదని నిప్పులు చెరిగారు. కశ్మీర్ పండిట్లకు రక్షణ కల్పించడంలో కేంద్రం ఘోరంగా విఫలమయ్యిందని విమర్శించారు. కశ్మీర్ సమస్యను బీజేపీ హ్యాండిల్ చేయలేకపోతోందని మండిపడ్డారు. కానీ కశ్మర్ పండిట్లకు ఆమ్‌ఆద్మీ పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు కేజ్రీవాల్. కశ్మీర్‌లో ప్రతి ఒక్కరికి తమ పార్టీ సాయం చేస్తుందని భరోసా ఇచ్చారు. కశ్మీర్ పండిట్లను టార్గెట్ చేసి పబ్బం గడుపుకోవాలన్న పాకిస్తాన్ లక్ష్యం ఎప్పటికి నెరవేరదన్నారు కేజ్రీవాల్.
ఢిల్లీ జంతర్‌మంతర్‌లో కశ్మీర్ పండిట్లకు మద్దతుగా ఆమ్‌ఆద్మీ పార్టీ ర్యాలీ నిర్వహించింది. బీజేపీ నిర్వాకంతో కశ్మీర్‌లో మళ్లీ 1990 నాటి పరిస్థితులు రిపీట్ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు కేజ్రీవాల్. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వాళ్లకు ఘననివాళి అర్పించారు.
అయితే ఆయన నోటి నుంచి ఉగ్రవాదులు, వేర్పాటువాదులకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా రాలేదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆదివారం ఆరోపించారు. అలాగే ఇక్కడ జరిగిన ఒక ర్యాలీని ఉద్దేశించి కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్‌లో హత్యల సంఘటనల కారణంగా కాశ్మీరీ పండిట్‌లు లోయను విడిచిపెట్టవలసి వస్తోందని ఆరోపించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి