AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air Pollution: కాలుష్య మరణాల్లో భారత్ టాప్.. మరి ఇదే విషయాన్ని వైద్యులు ఎందుకు సర్టిఫై చేయడం లేదో!

Delhi Air Pollution: క ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి తొమ్మిది మిలియన్ల మరణాలకు వాయు కాలుష్యమే కారణమని ఈ అధ్యయనం పేర్కొంది, కార్లు, ట్రక్కులు, పరిశ్రమల నుండి వచ్చే కలుషితమైన గాలి కారణంగా మరణాల సంఖ్య 2000 నుంచి 55 శాతం పెరిగింది.

Air Pollution: కాలుష్య మరణాల్లో భారత్ టాప్.. మరి ఇదే విషయాన్ని వైద్యులు ఎందుకు సర్టిఫై చేయడం లేదో!
Air Poluution
Basha Shek
|

Updated on: May 20, 2022 | 11:46 AM

Share

Air Pollution: దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్య తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా భారీగా పడిపోతుంది. ఈ సంగతి పక్కన పెడితే దేశంలోని చాలా నగరాల్లో కూడా వాయు కాలుష్య తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్‌లోని కొత్త అధ్యయనం ప్రకారం వాయు కాలుష్యం కారణంగా 2019లో భారతదేశంలో 24 లక్షల మంది మరణించారన్న సంచలన విషయాన్ని బయటపెట్టింది. సియాటెల్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్‌ తో పాటు గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ డేటాబేస్ ఆధారంగా కరోనాకు ముందు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి తొమ్మిది మిలియన్ల మరణాలకు వాయు కాలుష్యమే కారణమని ఈ అధ్యయనం పేర్కొంది, కార్లు, ట్రక్కులు, పరిశ్రమల నుండి వచ్చే కలుషితమైన గాలి కారణంగా మరణాల సంఖ్య 2000 నుంచి 55 శాతం పెరిగింది. కాగా వాయు కాలుష్యం కారణంగా సంభవించే మరణాలు భారత్‌లోనే ఎక్కువగా ఉన్నాయని ఈ అధ్యయనంలో తేలింది.

పెరుగుతున్న మరణాలు..

ఇక స్మోకింగ్‌, సెకండ్ హ్యాండ్‌ స్మోకింగ్‌ (ధూమపానం చేసేవారి పక్కన ఉన్నవారు) కారణంగా కూడా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఈ అధ్యయనం తెలిపింది. గుండె జబ్బులు, స్ట్రోక్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ఇతర ఊపిరితిత్తుల సమస్యలు, మధుమేహం తదితర అనారోగ్య సమస్యల కారణంగానే వీరు చనిపోయారని బాధితుల డెత్‌ సర్టిఫికెట్లలో పేర్కొన్నారు. అయితే వీటన్నింటికీ కారణమైన వాయుకాలుష్యమే ఈ మరణాలకు దారి తీసిందని ఏ డాక్టర్‌ కూడా సర్టిఫై చేయలేకపోయారు. కాగా 2020లో విడుదలైన వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత కలుషితమైన రాజధాని నగరంగా ఢిల్లీ ఉందని పేర్కొంది. అంతకుముందు 2016లో భారతదేశంలో సంభవించిన మొత్తం వ్యాధుల్లో 6 శాతానికి వాయు కాలుష్యం కారణమని 2017 నాటి ఇండియా స్టేట్ లెవల్ డిసీజ్ బర్డెన్ రిపోర్ట్ పేర్కొంది. ఇందులో ఎక్కువగా హృదయ, శ్వాసకోశ వ్యాధులు, అంటువ్యాధులు, నాన్ కమ్యూనికేబుల్ ఇన్ఫెక్షన్ వ్యాధులే ఎక్కువగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఢిల్లీతో పాటు అక్కడ కూడా..

ప్రపంచంలోని అత్యంత కలుషితమైన 30 నగరాల్లో ఇరవై రెండు భారతదేశంలోనే ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ అయితే ప్రపంచవ్యాప్తంగా అత్యంత కాలుష్య రాజధాని నగరంగా మారిపోయిందని పలు నివేదికలు, సంస్థలు నివేదిస్తున్నాయి. ఢిల్లీతో పాటు ఘజియాబాద్, బులంద్‌షహర్, బిస్రఖ్ జలాల్‌పూర్, నోయిడా, గ్రేటర్ నోయిడా, కాన్పూర్, లక్నో, మీరట్, ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా, ముజఫర్‌నగర్, రాజస్థాన్‌లోని భివారీ, ఫరీదాబాద్, హర్యానాలోని జింద్, హిసార్, ఫతేహాబాద్, బంధ్వారీ, గురుగ్రామ్, యమునా నగర్, రోహ్‌తక్, ధారుహేరా మరియు బీహార్‌లోని ముజఫర్‌పూర్ నగరాల్లో కూడా కాలుష్యం పెచ్చుమీరుతోందని ఆయా నివేదికలు చెబుతున్నాయి. వంట కోసం బయోమాస్ బర్నింగ్, విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమ, నిర్మాణం, వ్యర్థాలను కాల్చడం తదితర చర్యలతో పర్యావరణ కాలుష్యం పెరిగిపోతోందని ఈ నివేదికలు తేల్చాయి. దీంతో పాటు విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమలు, వాహనాలు, నిర్మాణాలు, వ్యర్థాలను కాల్చడం వంటి చర్యల ద్వారా కూడా బహిరంగ వాతావరణ కాలుష్యం పెరిగింది. ఇదే సమయంలో వంట కోసం ఘన ఇంధనాల వినియోగం తగ్గడం వల్ల గృహ వాయు కాలుష్యం భారం తగ్గిందని ఈ అధ్యయనాలు పేర్కొన్నాయి. ఢిల్లీతో పాటు హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వాయు కాలుష్యం మోతాదుకు మించి ఉందని నివేదికలు తేల్చిచెబుతున్నాయి.

వాటిపై అధ్యయనం జరగాలి!

కాగా తీవ్రమైన వాయు కాలుష్యం కారణంగానే శ్వాసకోశ వ్యాధులు పెరుగుతాయని వైద్యులు చెబుతున్నప్పటికీ ఈ విషయాన్ని ప్రధాన కారణమని చెప్పడానికి ఎవరూ సాహసించడం లేదు. కాగా వాయు కాలుష్యం కారణంగానే బాధితుడు మృతిచెందాడని రాయకుండా వైద్యులను ఏ చట్టం నిరోధించదు. గుండెపోటు, మూత్రపిండాల వైఫల్యం, లేదా క్యాన్సర్ వంటి మరణానికి ప్రత్యక్ష కారణాన్ని మాత్రమే వైద్యులు పేర్కొనాలి. మరణ ధ్రువీకరణ పత్రంలోనూ ఈ విషయాన్ని స్పష్టం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. కాగా వాయు కాలుష్యం కారణంగానే మరణం సంభవించిందని వైద్యులు రాయాలంటే, మనం అదే విషయాన్ని సూచించే అధ్యయనాల గురించి తెలుసుకోవాలి. ఉదాహరణకు, గర్భస్థ పిండంపై వాయు కాలుష్యం ప్రతికూల ప్రభావానికి సంబంధించి చైనా వివరణాత్మక అధ్యయనాన్ని నిర్వహించింది. వాయు కాలుష్యం కారణంగా బ్లడ్‌ రీడింగ్‌లలో హెచ్చుతగ్గులు వస్తున్నాయని అందుకే నవజాత శిశువులు అనారోగ్యం పాలవుతున్నారని ఒక నిర్ధారణకు వచ్చారు. వాయు కాలుష్యం వల్ల కొన్ని వ్యాధులు వస్తాయని ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. ఈక్రమంలో శ్యాసకోశ వ్యాధులు, వాయు కాలుష్యం మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని తెలుసుకోవడానికి లోతైన అధ్యయనం జరగాలి. దురదృష్టవశాత్తూ మన దేశంలోని ప్రభుత్వాలు, అధ్యయన సంస్థలు ఈ విషయం గురించి ఏ మాత్రం ఆలోచించడం లేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

TS Police Jobs 2022: ఉద్యోగార్థులకు అలెర్ట్‌.. పోలీస్‌ జాబ్స్‌ దరఖాస్తులకు మరికొన్ని గంటల్లో ముగియనున్న గడువు..

Sanjjanaa Galrani: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్‌.. ఫ్యాన్స్ అభినందనల వెల్లువ..

Ramcharan: స్పీడ్‌ పెంచిన మెగా పవర్‌స్టార్‌.. మరో టాప్‌ డైరెక్టర్‌కు గ్రీన్‌సిగ్నల్‌!