AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajit Pawar: విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ CM అజిత్‌ పవార్‌ దుర్మరణం

మహారాష్ట్రలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ దుర్మరణం చెందారు. బుధవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పవార్‌తో పాటు మరికొందరు చనిపోయారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.

Ajit Pawar: విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ CM అజిత్‌ పవార్‌ దుర్మరణం
Ajit Pawar Plane Crash
Ram Naramaneni
|

Updated on: Jan 28, 2026 | 9:58 AM

Share

బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో ఆయనతో కలిపి మొత్తం ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో అజిత్‌ పవార్‌ ఉన్నట్లు డీజీసీఏ నిర్ధారించింది. ఈ సంఘటన మొత్తం మహారాష్ట్రను కుదిపేసింది. రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించింది.

అందిన సమాచారం ప్రకారం.. జిల్లా పరిషత్ ఎన్నికలకు ప్రచార సమావేశాలు బారామతిలో నిర్వహిస్తున్నారు.  ఈ క్రమంలో అజిత్ పవార్ బుధవారం ఉదయం ముంబై నుంచి ప్రత్యేక విమానంలో బారామతికి బయలుదేరారు. అయితే, విమానం ఎయిర్‌పోర్ట్  రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా, అకస్మాత్తుగా సాంకేతిక లోపం ఏర్పడింది. దీని కారణంగా, పైలట్ నియంత్రణ కోల్పోయి విమానం కూలిపోయింది. ప్రమాదం చాలా దారుణంగా జరిగినట్లు సమాచారం. విమానం కూలిపోయిన తర్వాత పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది.  విమానం తీవ్రంగా దెబ్బతింది.

విమానం క్రాష్ అయిన తర్వాత వీడియో దిగువన చూడండి… 

అజిత్ పవార్ మరణవార్త తెలియగానే, బారామతితో సహా జిల్లా అంతటా ఆందోళన వాతావరణం వ్యాపించింది. సమావేశ స్థలాల్లో ఉన్న కార్యకర్తలు విమానాశ్రయం, ఆసుపత్రికి చేరుకుంటున్నారు. విమాన ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఇది సాంకేతిక లోపమా లేదా మరేదైనా కారణమా అని దర్యాప్తు చేయడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఉన్నత స్థాయి విచారణ నిర్వహించే అవకాశం ఉంది.