చాణక్య నీతి : అన్నీ ఉన్నప్పటికీ కొందరు జీవితంలో ఎందుకు సంతోషంగా ఉండలేరో తెలుసా?
Samatha
28 January 2026
ఆచార్య చాణక్యుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈయన తన కాలంలో అత్యంత జ్ఞానవంతుడిగా మంచి పేరు ప్రఖ్యాతుల సంపాదించుకున్నాడు.
పేరు ప్రఖ్యాతులు
ఈయన గొప్ప గురువు మాత్రమే కాకుండా, మానవ స్వభావంపై మంచి అవగాహన ఉన్న వ్యక్తి. అందుకే చాలా విషయాలను తెలియజేశాడు.
గొప్ప గురువు
అదే విధంగా ఆయన సంతోషం , దుఃఖం మన స్వభావం ద్వారా నిర్ణయించబడతాయని చాణక్య నీతి చెబుతుంది. కొందరు అన్నీ ఉన్నా, ఆనందంగా ఉండలేరు.
మానవ స్వభావం
దానికి కారణం వారి అలవాట్లే, అవి వారికి అది పెద్ద శత్రువులుగా మారుతాయంట. ఇప్పుడు మనం అన్నీ ఉన్నా ఎందుకు? కొందరు ఆనందంగా ఉండరో తెలుసుకుందాం.
శత్రువులు
చాణక్య నీతి ప్రకారం, ఎప్పుడూ ఫిర్యాదు చేసే వ్యక్తి, తమ జీవితంలో ఎప్పుడూ ఆనందంగా ఉండలేడంట. ప్రతి చిన్న విషయంలో ప్రతికూలతలను చూసి, వారు మానసికంగా బలహీనులు అవుతారు.
ఫిర్యాదు చేయడం
అదే విధంగా అతిగా అత్యాశ ఉన్న వ్యక్తులు కూడా జీవితంలో ఎప్పుడూ సంతృప్తిగా ఉండలేరంట. ఇలాంటి వారు తమ వద్ద ఉన్నదాని కంటే ఎక్కువ కోరుకుంటారంట.
అతి అత్యాశ
కోపం అనేది ఏ వ్యక్తికి అయినా సరే అతి పెద్ద శత్రువు. అందుకే చిన్న చిన్న విషయాలకు కూడా కోపం తెచ్చుకునే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండలేడంట.
కోపం
అన్నీ ఉన్నప్పటికీ , ఏ వ్యక్తి అయితే చెడు సహవాసానికి బానిస అవుతాడో, అలాంటి వ్యక్తి సోమరితనం, ప్రతికూల ఆలోచనలతో ఉంటాడు, అతను సంతోషంగా ఉండలేడు.