పెరుగు తిన్న వెంటనే స్వీట్ తినడం మంచిదేనా?

Samatha

28 January 2026

పెరుగు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అందుకే తమ భోజనంలో తప్పనిసరిగా పెరుగు ఉంటుంది. కనీసం చివరి ముద్ద అయినా సరే ఇష్టంగా పెరుగు తింటారు.

పెరుగు

అంతే కాకుండా పెరుగులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పెరుగు తినడం వలన ఇది జీర్ణ క్రియను మెరుగు పరిచి, గ్యాస్, ఎసిడిటీ సమస్యలను తగ్గిస్తుంది.

పోషకాలు పుష్కలం

అయితే చాలా మందిలో ఓ డౌట్ ఉంటుంది. అసలు పెరుగు తిన్న వెంటనే స్వీట్ తినడం మంచిదేనా? దీని వలన ఏవైనా సమస్యలు వస్తాయా అని? దాని గురించే తెలుసుకుందాం.

పెరుగు, స్వీట్

అయితే పెరుగు తిన్న వెంటనే స్వీట్ తినడం అస్సలే మంచిది కాదంట. ఇది అధిక బరువుకు కారణం అవుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

అధిక బరువు

పెరుగు ప్రోబయోటిక్ కాబట్టి, అది చక్కెరతో కలిసినప్పుడు దానిలోని మంచి బ్యాక్టీరియా నశించి, అనేక రకాల కడుపు సమస్యలకు కారణం అవుతుందంట. దాని గురించి తెలుసుకుందాం.

కడుపు సమస్యలు

పెరుగు తిన్న వెంటనే స్వీట్ తినడం వలన ఇది తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేయదు. తద్వారా గ్యాస్ , ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి.

గ్యాస్ , ఎసిడిటీ

అలాగే పెరుగు తిన్న వెంటనే స్వీట్ తినడం వలన పెరుగు పుల్లగా, చక్కెర స్వీట్‌గా ఉండటం వలన ఇది జీర్ణక్రియను పూర్తిగా దెబ్బతీసే ప్రమాదం ఉన్నదంట. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరిగే ఛాన్స్ ఉన్నదంట.

జీర్ణక్రియ

అందువలన పెరుగు తిన్న వెంటనే స్వీట్ తినకూడదంట. వీలైతే 30 నిమిషాలు ఆగి, ఆ తర్వాత స్వీట్ తినడం మంచిదని, ఇది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపదు అంటున్నారు నిపుణులు.

30 నిమిషాలు