AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుండె తరుక్కుపోయే ఘటన.. మంచులో కూరుకుపోయిన యాజమాని కోసం 4 రోజులుగా శునకం కాపలా..!

కుక్క అంటేనే విశ్వాసానికి మారుపేరు. దానికి ఆశ్రయం ఇచ్చిన వారిపట్ల ఎంతో విధేయత చూపుతుంది. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి యాజమానిని కాపాడిన సందర్భాలు ఎన్నో చూశాం. అలాంటి ఘటనే ఇప్పుడు ఒకటి జరిగింది. ఈ ఘటన గుండె తరుక్కుపోయేలా చేస్తోంది. ఈ శునకం.. విశ్వాసానికి మారుపేరు అని రుజువు చేసింది. హిమాచల్ ప్రదేశ్‌లో ఈ హృదయ విదారక సంఘటన జరిగింది.

గుండె తరుక్కుపోయే ఘటన.. మంచులో కూరుకుపోయిన యాజమాని కోసం 4 రోజులుగా శునకం కాపలా..!
Pit Bull Humanity
Balaraju Goud
|

Updated on: Jan 28, 2026 | 7:40 AM

Share

కుక్క అంటేనే విశ్వాసానికి మారుపేరు. దానికి ఆశ్రయం ఇచ్చిన వారిపట్ల ఎంతో విధేయత చూపుతుంది. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి యాజమానిని కాపాడిన సందర్భాలు ఎన్నో చూశాం. అలాంటి ఘటనే ఇప్పుడు ఒకటి జరిగింది. ఈ ఘటన గుండె తరుక్కుపోయేలా చేస్తోంది. ఈ శునకం.. విశ్వాసానికి మారుపేరు అని రుజువు చేసింది. హిమాచల్ ప్రదేశ్‌లో ఈ హృదయ విదారక సంఘటన జరిగింది. ఆ కుక్క తన యజమాని మృతదేహాన్ని నాలుగు రోజులకు పైగా ఎముకలు కొరికే చలిలో కాపలాగా ఉంది.

హిమాచల్‌ ప్రదేశ్‌లో భయంకరమైన మంచును సైతం లెక్కచేయకుండా యాజమాని చూపిన ప్రేమకు విధేయత చూపింది. మంచులో కూరుకుపోయి యాజమాని చనిపోతే అతని మృతదేహానికి నాలుగు రోజులు కాపలా కాసింది ఈ శునకం. ఈ హృదయ విదారకమైన ఉదంతం చాలామందికి కన్నీళ్లు తెప్పించింది. ఈ ఘటన హిమాచల్‌ ప్రదేశ్‌ చంబా జిల్లా భర్మౌర్‌లో జరిగింది. మంచు వీడియోలు చిత్రీకరించడానికి వెళ్లిన పీయూష్‌.. భర్మౌర్‌లోని బర్మనీ ఆలయం దగ్గర కనిపించకుండా పోయారు.

చివరకు మంచులో చిక్కుకుని మరణించినట్లు అధికారులు గుర్తించారు. అతడి కోసం గాలించి, నాలుగు రోజుల తర్వాత మృతదేహాన్ని గుర్తించారు. అక్కడ కనిపించిన హృదయ విదారకమైన ఉదంతం చాలామందికి కన్నీళ్లు తెప్పించింది. తన యాజమాని పీయూష్‌ మంచులో కూరుకుపోవడంతో.. అతడిని మంచులో నుంచి బయటకు తీసుకురాలేని పరిస్థితిలో.. నాలుగు రోజులుగా యాజమాని డెడ్‌బాడీ పక్కనే ఉండి రోదించింది ఆ శునకం. తిండి, నిద్ర మానుకుని డెడ్ బాడీ పక్కనే పడిగాపులు కాసింది. యాజమాని కోసం దీనంగా చూస్తూ కన్నీరు పెట్టుకుంది. జంతువుల బారిన తన యజమాని మృతదేహం పడకుండా కాపాడింది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. జస్ట్‌ ఒక్క టచ్‌తో..!
వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. జస్ట్‌ ఒక్క టచ్‌తో..!
టీమిండియా కఠిన నిర్ణయం..నాలుగో టీ20 నుంచి తోపు ప్లేయర్ అవుట్?
టీమిండియా కఠిన నిర్ణయం..నాలుగో టీ20 నుంచి తోపు ప్లేయర్ అవుట్?
యజమాని కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి కుక్క..!
యజమాని కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి కుక్క..!
నేటి నుంచే మేడారం మహాజాతర ప్రారంభం.. సకల ఏర్పాట్లు పూర్తి
నేటి నుంచే మేడారం మహాజాతర ప్రారంభం.. సకల ఏర్పాట్లు పూర్తి
'యానిమల్' సీక్వెల్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?
'యానిమల్' సీక్వెల్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?
డేంజరస్ బంతికి క్లీన్‌బౌల్డ్.. కట్‌చేస్తే.. ట్విస్ట్ చూస్తే షాకే
డేంజరస్ బంతికి క్లీన్‌బౌల్డ్.. కట్‌చేస్తే.. ట్విస్ట్ చూస్తే షాకే
FTUతో ఒక్క రోజులో రూ.18 వేల కోట్ల నష్టం!
FTUతో ఒక్క రోజులో రూ.18 వేల కోట్ల నష్టం!
అండర్-19 వరల్డ్ కప్‌లో భారత్ జైత్రయాత్ర..సూపర్-6లో బోణీ అదిరింది
అండర్-19 వరల్డ్ కప్‌లో భారత్ జైత్రయాత్ర..సూపర్-6లో బోణీ అదిరింది
ఆఫీస్ బ్యాగ్‌లో ఇవి ఉంటే దరిద్రమే.. మీ కెరీర్ బాగుండాలంటే వెంటనే
ఆఫీస్ బ్యాగ్‌లో ఇవి ఉంటే దరిద్రమే.. మీ కెరీర్ బాగుండాలంటే వెంటనే
అర్జిత్ సింగ్ ఒక్కో సాంగ్‌కు ఎంత తీసుకుంటాడు? మొత్తం ఆస్తులెంత?
అర్జిత్ సింగ్ ఒక్కో సాంగ్‌కు ఎంత తీసుకుంటాడు? మొత్తం ఆస్తులెంత?