AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా డాక్టర్ల డ్యాన్సింగ్ బ్రేక్ ! రిలాక్సింగ్ మూడ్ !

బెంగుళూరు లోని విక్టోరియా ఆసుపత్రిలో కరోనా రోగులకు నిరంతరం సేవలందిస్తున్న డాక్టర్లు తమకు కాస్త బ్రేక్ దొరికేసరికి చిన్న పిల్లల్లా మారిపోయి రిలాక్స్ అవుతున్నారు....

కరోనా డాక్టర్ల డ్యాన్సింగ్ బ్రేక్ ! రిలాక్సింగ్ మూడ్ !
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 03, 2020 | 4:43 PM

Share

బెంగుళూరు లోని విక్టోరియా ఆసుపత్రిలో కరోనా రోగులకు నిరంతరం సేవలందిస్తున్న డాక్టర్లు తమకు కాస్త బ్రేక్ దొరికేసరికి చిన్న పిల్లల్లా మారిపోయి రిలాక్స్ అవుతున్నారు. కొందరు పాత సినిమాల్లోని పాటలకు స్టెప్పులు వేస్తూ స్ట్రెస్ నుంచి బయటపడుతున్నారు. ఇటీవల ముగ్గురు వైద్యులు తమ పీపీఈ కిట్లతోనే.. 1960 ప్రాంతం నాటి హిందీ మూవీలోని ‘లిఖి జో ఖత్ తుఝే’ సాంగ్ కి డ్యాన్స్ చేశారు. సుమారు 40 సెకండ్ల  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి డాక్టర్లంతా తమ ఇళ్లకు, తమ కుటుంబాలకు రోజుల తరబడి దూరంగా ఉంటున్నారు. కొంతమంది వారం రోజులైతే,, మరికొందరు సుమారు 15  రోజుల వరకు కూడా తమ ఇళ్ల ముఖం చూడలేకపోతున్నారు. అందువల్లే వీరు అటు కరోనా రోగుల్లో మానసికంగా, శారీరకంగా ఉత్సాహం నింపేందుకు, వారికి ఉల్లాసం కలిగించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మహిళా రోగులకు మెహెంది పోటీలు, పిల్లలకు పెయింటింగ్ కాంపిటీషన్లు నిర్వహించడం వంటివి చేపడుతున్నారు. ఈ హాస్పిటల్ లో 18 మంది పిల్లలు కూడా చికిత్స పొందుతున్నారు. కొంతమంది డాక్టర్లు తమ స్టాఫ్ కి ఫుడ్ కూడా తయారు చేయడం విశేషం. కర్నాటకలో మొత్తం 3,796 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో 388 కొత్త కేసులు.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం