డయాబెటీస్ రోగులకు దివ్వ ఔషదం.. రోజూ ఒక్క గ్లాస్ తాగితే
04 Nov 2026
Anand T
మెంతులు ఇవి మన జుట్టు ఆరోగ్యానికికే కాకుండా.. మన పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో కూడా చాలా బాగా పనిచేస్తాయి.
ప్రయోజనాలు
చాలా మంది వీటిని కేవలం వంటల్లో మాత్రమే వాడుతారు.. కానీ వీటి ద్వారా ఇంకా ఎన్నలో లాభాలు ఉన్నాయి.
అంతులేని లాభాలు
మెంతులలో మన శరీరానికి కావాల్సిన ఫైబర్, ఐరన్, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
పోషకాల గని
ముఖ్యంగా డయాబెటీస్ రోగులకు ఇది దివ్వ ఔషదంలా పనిచేస్తుంది. ఎందుకంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్‌లో ఉంచుతాయి.
దివ్వ ఔషదం
ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది. అలాగే ఎర్ర రక్త కణాలు, హిమోగ్లోబిన్ ఉత్పత్తి పెంచుతుంది.
జీర్ణక్రియ
ఇందుకోసం మీరు ఒక టీస్పూన్ మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఆ నీటిని ఉదయాన్నే పరగడుపున తాగి, ఆ తర్వాత గింజలను నమిలి తినాలి.
నానబెట్టడం
రోజుకు 5 నుండి 19 గ్రాముల మెంతులను మీ ఆహారంలో చేర్చుకుంటు మీరు ఈజీగా డయాబెటీస్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు.
డయాబెటీస్ కంట్రోల్
అయితే ఇవి రక్తంలో చక్కెర స్థాయిను పెరగకుండా నియంత్రణలో ఉంచగవు తప్ప.. ఈ వ్యాధి పూర్తిగా తగ్గించలేవు. కాబట్టి వీటితో పాటు కచ్చితంగా వైద్యులు సూచించే మందులను ఉపయోగించడం చాలా ఉత్తమం.