గిన్ని కోడి జీవితం గురించి తెలుసా? దీని కథ చాలా పెద్దదే

samatha

4 November 2026

Pic credit - Pinterest

సహజంగా కనిపించే కోళ్ల గురించి అందరికీ తెలుసు. కానీ మీకు గిన్ని కోడి జీవితం గురించి తెలుసా? దీని లైఫ్ జర్నీ చాలా డిఫరెంట్‌గా ఉంటుందంట.

కోళ్లు

గిన్నె కోడిని గిన్ని కోడి,  చీనా కోడి, చైనా కోడి అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం  Numida meleagris. తలపై తక్కువ ఈకలు, నీలం ఎరుపు ముఖం, శరీరంపై చిన్న తెల్ల చుక్కలతో విలక్షణంగా కనిపిస్తుంది.  

గిన్ని కోడి

 ఆఫ్రికాలోని సవన్నా, గడ్డి మైదానాల నుండి వచ్చిన ఈ పక్షి ఇప్పుడు భారతదేశంలో కూడా పెంచబడుతోంది. చాలా మంది ఇళ్లలో పెంచుకుంటున్నారు.

ఆఫ్రీకా

అయితే నేలపైనే పెరిగే ఈ కోడి, చెట్లపైకి కూడా ఎక్కగలదు. ఇది గింజలు, గడ్డి, కీటకాలను ఆహారంగా చేసుకొని తింటుంది.

కీటకాలు, గడ్డి

ముఖ్యంగా ఈ జాతి కోళ్లు పొలంలో కీటకాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక ఇవి చాలా ఐక్యంగా ఉంటాయి. ప్రమాదం అనిపిస్తే చాలు గుంపు ఒక్క దగ్గరికి చేరుతుంది.

పొలంలో కీటకాలు

మొత్తం గుంపు ఒక్కసారిగా పెద్దగా అరుస్తూ ఇతర పక్షులను అప్రమత్తం చేస్తుంది. అందుకే వీటిని "సహజ అలారం పక్షులు" అని పిలుస్తారు.

అలారం పక్షులు

నేలపై ఎక్కువ సమయం గడిపినప్పటికీ, అవసరమైనప్పుడు కొద్ది దూరం ఎగిరి చెట్లపైకి చేరుకోగలవు. సంతానోత్పత్తి సమయంలో, ఆడ పక్షి నేలపై గూడు కట్టి గుడ్లు పెడుతుంది.

సంతానోత్పత్తి

గుడ్ల నుంచి బయటకొచ్చే పిల్లలను కీట్స్ అంటారు. పుట్టిన కొద్దిసేపటికే తల్లిదండ్రులను అనుసరించి తిరగడం ప్రారంభిస్తాయి . పిల్లల పెంపకంలో మగ కోడి కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

మగ కోడి పాత్ర