Cyclone Tauktae: బీభత్సం సృష్టిస్తున్న “తౌక్టే” మహారాష్ట్ర, గుజరాత్ తీర ప్రాంతంపై తీవ్ర ప్రభావం..
Cyclone Tauktae: మహారాష్ట్ర, గుజరాత్ తీర ప్రాంతంపై తౌక్టే బీభత్సం సృష్టించింది. సోమారం రాత్రి ఇది గుజరాత్‌లోని పోరుబందర్ – మహువా మధ్య తీరం దాటింది. ఆ సమయంలో గంటకు సుమారు 185 కి.మీ.ల వేగంతో పెను గాలులు...
మహారాష్ట్ర, గుజరాత్ తీర ప్రాంతంపై తౌక్టే బీభత్సం సృష్టించింది. సోమారం రాత్రి ఇది గుజరాత్‌లోని పోరుబందర్ – మహువా మధ్య తీరం దాటింది. ఆ సమయంలో గంటకు సుమారు 185 కి.మీ.ల వేగంతో పెను గాలులు, 3 మీటర్లకు పైఎత్తున లేస్తున్న రాకాసి అలలు, అతి భారీ వర్షాలతో అత్యంత తీవ్ర తుపానును తలపించింది. ఈ ధాటికి అరేబియా సముద్రంలో నిలిపి ఉంచిన రెండు భారీ నౌకలు తమతమ లంగర్లను తెంచుకుని సముద్రంలోకి కొట్టుకు పోయాయని అధికారులు వెల్లడించారు. అయితే అందేలోని సుమారు 410 మంది సిబ్బందిని రక్షించడానికి నౌకాదళం రంగంలోకి దిగింది. భావ్‌నగర్ జిల్లాలో కొన్ని ప్రాంతాలకు ఆదివారం రాత్రి నుంచి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఈ జిల్లాలోని ఘోఘా ఓడరేవులో 9వ నంబరు అతి ప్రమాద హెచ్చరిక జెండాను ఎగరవేశారు.
అహ్మదాబాద్, సూరత్, రాజ్‌కోట్ విమానాశ్రయాల నుంచి విమానాల రాకపోకల్ని మంగళవారం సాయంత్రం వరకు రద్దు చేశారు. సూరత్‌లో రెండు మీటర్ల ఎత్తున సముద్ర కెరటాలు ఎగిసిపడ్డాయి. సోమవారం అర్ధరాత్రికి వీరిలో 60 మందిని రక్షించింది. 23 ఏళ్ల తర్వాత గుజరాత్‌ను తాకుతున్న అత్యంత భీకరమైన తుపాను తౌక్టేను పరిగణిస్తున్నారు.
తుపాను మార్గంలో ఉన్న నౌకాశ్రయాల్లో అత్యంత ప్రమాద పరిస్థితిని సూచించే 9 లేదా 10 ప్రమాద హెచ్చరికలను జారీ చేయాలని వాతావరణ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మనోరమ సూచించారు. గుజరాత్‌లో లోతట్లు ప్రాంతాల నుంచి దాదాపు రెండు లక్షల మందిని సహాయ కేంద్రాలకు తరలించారు. 54 ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో నిమగ్నమయ్యాయని అధికారులు తెలిపారు.
తుపాను ప్రభావం, సహాయక చర్యల తీరుతెన్నులపై గుజరాత్, మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులతో, దమణ్ దీవ్ లెఫ్టినెంట్ గవర్నర్‌తో ప్రధాని మోడీ ఫోన్లో సమాచారం కనుకున్నారు. సామాన్య ప్రజలకు దగ్గరగా ఉండాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త్రివిధ దళాలను ఆదేశించారు. నౌకలు, గజ ఈతగాళ్లు, సహాయక సామగ్రిని ఎక్కడెక్కడ మోహరించాలో నిర్దేశించారు.
ఇవి కూడా చదవండి: Bill Gates: బిల్ గేట్స్ తన సంస్థలో మహిళా ఉద్యోగులను డేటింగ్ కు పిలిచారా..?? ( వీడియో )