ఓర్నాయనో ఏంట్రా ఇది.. ఎయిర్‌పోర్టులో కాస్త తేడాగా కనిపించిన ఇద్దరు వ్యక్తులు.. ఆపి చెక్ చేయగా..
ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. రెండు వేరువేరు కేసుల్లో 5.75 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. పట్టుకున్న బంగారం విలువ 5.10 కోట్లుగా ఉంటుందని పోలీసులు తెలిపారు. అరెస్టయిన నిందితులు ఇద్దరూ కూడా విమానాశ్రయంలో పనిచేస్తున్న సిబ్బందిగా తెలిపారు.

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. రెండు వేరువేరు కేసుల్లో 5.75 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. పట్టుకున్న బంగారం విలువ 5.10 కోట్లుగా ఉంటుందని పోలీసులు తెలిపారు. అరెస్టయిన నిందితులు ఇద్దరూ కూడా విమానాశ్రయంలో పనిచేస్తున్న సిబ్బందిగా తెలిపారు. ఇద్దరూ కూడా దుస్తుల లోపల, జాకెట్లు, జేబుల్లో బంగారాన్ని దాచిపెట్టారని అధికారులు తెలిపారు. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు.. బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ప్రయాణికుల నుంచి తీసుకుని.. బయటకు తరలిస్తున్నారని.. ఈ క్రమంలో వారిని తనిఖీ చేయగా పెద్ద ఎత్తున బంగారం దొరికిందని అధికారులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ విభాగం వెల్లడించింది.
మే 17, 2025న రెండు వేర్వేరు కేసుల్లో ₹5.10 కోట్ల విలువ చేసే మొత్తం 5.75 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు CSMI అంతర్జాతీయ విమానాశ్రయ కమిషనరేట్, జోన్-III ముంబై కస్టమ్స్ అధికారులు ప్రకటనలో వెల్లడించారు..
మొదటి కేసు: విమానాశ్రయ లాంజ్‌లో పనిచేసే ఒక వ్యక్తి సిబ్బంది బయలుదేరే ప్రాంతాన్ని దాటుతున్నప్పుడు ఆపి తనిఖీ చేశారు. అతని దుస్తుల లోపల నుంచి మైనంలో దాచిన బంగారు పొడిని స్వాధీనం చేసుకున్నారు. 2800 గ్రాముల బంగారం విలువ సుమారు 2.48 కోట్లు ఉంటుంది. అతని నుంచి మొత్తం 06 పౌచ్‌లు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులో బంగారాన్ని ఒక ప్రయాణీకుడు అతనికి అప్పగించాడని తేలిందని.. నిందితుడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
రెండడ కేసు: మరొక కేసులో, కాంట్రాక్టుపై పనిచేస్తున్న ఒక వ్యక్తి సిబ్బంది నిష్క్రమణ స్థానం దాటుతుండగా ఆపి తనిఖీ చేశారు. అతని జాకెట్ జేబు నుండి మైనపులో దాచిన 06 పౌచ్‌ల బంగారు పొడిని స్వాధీనం చేసుకున్నారు.. దీని మొత్తం నికర బరువు 2950 గ్రాములు.. దీని విలువ రూ.2.62 కోట్లు.. ఈ బంగారాన్ని కూడా ఒక ప్రయాణీకుడు అతనికి అప్పగించాడని వెల్లడైంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని.. వీటిపై కస్టమ్స్ శాఖ తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




