National: విమానం దిగిన లేడీ ప్యాసింజర్‌ బ్యాగులో ఏదో అలజడి.. అనుమానమొచ్చి చెక్‌ చేయగా.. వామ్మో

అధికారులు ఎన్ని రకాల చర్యలు చేపట్టినా అక్రమ నేరాలు మాత్రం ఆగడం లేదు. అత్యంత భద్రతా ఉండే విమానాశ్రయాల్లో కూడా నేరస్థులు ఆగడాలకు అడ్డుకట్టపడడం లేదు. మరీ ముఖ్యంగా విదేశాల నుంచి అక్రమంగా కొన్ని రకాల వస్తువులను తరలిస్తూ చట్టాలను తుంగలో...

National: విమానం దిగిన లేడీ ప్యాసింజర్‌ బ్యాగులో ఏదో అలజడి.. అనుమానమొచ్చి చెక్‌ చేయగా.. వామ్మో
Representative Image
Follow us

|

Updated on: Apr 29, 2023 | 9:04 PM

అధికారులు ఎన్ని రకాల చర్యలు చేపట్టినా అక్రమ నేరాలు మాత్రం ఆగడం లేదు. అత్యంత భద్రతా ఉండే విమానాశ్రయాల్లో కూడా నేరస్థులు ఆగడాలకు అడ్డుకట్టపడడం లేదు. మరీ ముఖ్యంగా విదేశాల నుంచి అక్రమంగా కొన్ని రకాల వస్తువులను తరలిస్తూ చట్టాలను తుంగలో తొక్కుతున్నారు. ఇప్పటి వరకు ఎన్నో రకాల అక్రమ రవణాకు సంబంధించిన సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే చెన్నై ఎయిర్‌పోర్టులో శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. కౌలాంపూర్‌ నుంచి ఏకే13 నెంబర్‌ గల విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలు చెన్నై ఎయిర్‌ పోర్ట్‌లో దిగింది. అనంతరం భారీ లగేజ్‌తో ఎయిర్‌పోర్ట్‌ బయటకు వెళ్లేందుకు ప్రయత్నించింది. ఈ సమయంలోనే బ్యాగులో ఏదో అలకిడి అయినట్లు కస్టమ్స్‌ అధికారులకు అనిపించింది. దీంతో అనుమానం వచ్చి సదరు మహిళ లగేజ్‌ను చూపించమని కోరారు. బ్యాగ్‌ ఓపెన్‌ చేయగానే కనిపించిన దృశ్యానికి అధికారులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు.

ఇవి కూడా చదవండి

Chennai

ఇంతకీ ఆ బ్యాగులో ఏముందనేగా మీ సందేహం. మలేషియా నుంచి వచ్చిన ఆ మహిళా తనతో పాటు బ్యాగులో పాములను తీసుకొచ్చింది. ఒకటి కాదు రెండు కాదు వివిధ జాతులకు చెందిన 22 పాములు బయటపడ్డాయి. వీటితో పాటు ఒక ఊసరవెళ్లి సైతం ఉంది. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ అధికారులు సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. కస్టమ్స్‌ యాక్ట్‌ 1962, 1962 r/w వైల్డ్‌లైఫ్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ కింద సదరు జీవులను సీజ్‌ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..