AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Muskan Narang: ఫ్యాషన్ డిజైనర్ సూసైడ్.. ఆత్మహత్యకు ముందు ఇన్‏స్టాలో వీడియో షేర్ చేసి మరీ..

.ఇటీవలే ముంబై నుంచి యూపీ వెళ్లిన ఆమె గురువారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి సరదాగా భోజనం చేసింది. ఆ మరుసటి రోజు ఉదయం ఆమె తల్లి ముస్కాన్ గదిలోకి వెళ్లగా ఆమె కనిపించలేదు. ఇళ్లంతా వెతికినా ఎక్కడా కనిపించకపోవడంతో పైనున్న స్టోర్ రూంకు వెళ్లి చూడగా.. ముస్కాన్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది.

Muskan Narang: ఫ్యాషన్ డిజైనర్ సూసైడ్.. ఆత్మహత్యకు ముందు ఇన్‏స్టాలో వీడియో షేర్ చేసి మరీ..
Muskan Narang
Rajitha Chanti
|

Updated on: Apr 29, 2023 | 9:32 PM

Share

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ముస్కాన్ నారంగ్ ఆత్మహత్యకు పాల్పడింది. ఉత్తరప్రదేశ్ లోని తన నివాసంలోని స్టోర్ రూమ్‏లో ఆమె తన స్కార్ఫ్ తో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. గురువారం రాత్రి ముస్కాన్ ప్రాణాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పోలీసుల సమాచారం ప్రకారం..ఇటీవలే ముంబై నుంచి యూపీ వెళ్లిన ఆమె గురువారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి సరదాగా భోజనం చేసింది. ఆ మరుసటి రోజు ఉదయం ఆమె తల్లి ముస్కాన్ గదిలోకి వెళ్లగా ఆమె కనిపించలేదు. ఇళ్లంతా వెతికినా ఎక్కడా కనిపించకపోవడంతో పైనున్న స్టోర్ రూంకు వెళ్లి చూడగా.. ముస్కాన్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. దీంతో వెంటనే ఆమెను కిందికి దింపి ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యలు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అయితే చనిపోవడానికి కొన్ని గంటల ముందు ముస్కాన్ తన ఇన్ స్టాలో షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. అందులో ఇదే నా లాస్ట్ వీడియో అంటూ ముస్కాన్ చెప్పడం గమనార్హం. ‘ఇదే నా లాస్ట్ వీడియో. ఇకపై నేను మీకు కనిపించను. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ని కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేశాను. కానీ తిరిగి వాళ్లే నన్ను కన్విన్స్ చేస్తున్నారు. నేను చేసే దాంట్లో ఎవరి ప్రమేయం లేదు. దయచేసి ఎవరిని నిందించకండి’ అంటూ చివరికి కామెడీతో ముగించింది.

ఇవి కూడా చదవండి

అయితే ముంబై నుంచి వచ్చిన తర్వాత ముస్కాన్ చాలా బాధగా ఉండేదని.. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండేదని కుటుంబసభ్యులు తెలిపారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తమతో ఎంతో సరదాగా గడిపిందని ముస్కాన్ తండ్రి తెలిపారు. ముస్కాన్ ఢిల్లీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసిన అనంతరం.. ముంబైలోని ఒక కంపెనీలో ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..