బ్లాక్ డే కి ఉగ్రవాదుల పిలుపు ? శ్రీనగర్ లో కర్ఫ్యూ !
శ్రీనగర్ లో రెండు రోజులపాటు కర్ఫ్యూ విధించారు. జమ్మూ కాశ్మీర్ కి స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన 370 అధికరణాన్ని కేంద్రం..
శ్రీనగర్ లో రెండు రోజులపాటు కర్ఫ్యూ విధించారు. జమ్మూ కాశ్మీర్ కి స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన 370 అధికరణాన్ని కేంద్రం గత ఏడాది ఆగస్టు 5 న రద్దు చేసింది. ఇందుకు నిరసనగా బుధవారం బ్లాక్ డేగా పాటించాలని కాశ్మీర్ లోని వేర్పాటువాదులు, పాకిస్థాన్ టెర్రరిస్టు బృందాలు యోచిస్తున్నట్టు తమకు వార్తలందాయని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులు రహస్యంగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని, సమయం కోసం ఎదురు చూస్తున్నారని ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో.. ఆగస్టు 5 న బ్లాక్ డే గా పాటించాలని వారు యోచిస్తున్నట్టు తెలిసిందని ఇంటెలిజెన్స్ అధికారులు అన్నారు. ముందు జాగ్రత్త చర్యగా మంగళ, బుధ వారాల్లో కర్ఫ్యూ విధిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.