AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid 19: దేశంలో కరోనా కొత్త వేరియంట్‌.. ఆ రాష్ట్రంలో నాలుగు కేసులు.. వారంతా అమెరికా నుంచి వచ్చినట్లు గుర్తింపు

దేశంలో కరోనా వైరస్‌ మళ్లీ వెంటాడుతోంది. గత మూడేళ్ల కిందట దేశాలను అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి కొత్త కొత్త వేరియంట్లతో వ్యాపిస్తోంది. ఇప్పుడు ఫోర్త్‌ వేవ్‌లో కేసులు..

Covid 19: దేశంలో కరోనా కొత్త వేరియంట్‌.. ఆ రాష్ట్రంలో నాలుగు కేసులు.. వారంతా అమెరికా నుంచి వచ్చినట్లు గుర్తింపు
Covid 19
Subhash Goud
|

Updated on: Jan 05, 2023 | 6:26 AM

Share

దేశంలో కరోనా వైరస్‌ మళ్లీ వెంటాడుతోంది. గత మూడేళ్ల కిందట దేశాలను అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి కొత్త కొత్త వేరియంట్లతో వ్యాపిస్తోంది. ఇప్పుడు ఫోర్త్‌ వేవ్‌లో కేసులు నమోదవుతున్నాయి. ఇక చైనాలో కొత్త వేరియంట్‌ BF.7 వేరియంట్‌ ప్రపంచ దేశాలకు పాకుతోంది. భారత్‌లో ఈ కొత్త వేరియంట్‌ కలకలం సృష్టిస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో కరోనా వైరస్ వేరియంట్ ఓమిక్రాన్ సబ్-వేరియంట్ BF.7 నాలుగు కేసులు నమోదు అయ్యాయి. అయితే అందరూ అమెరికా నుంచి వచ్చారని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇటీవల అమెరికా నుంచి తిరిగి వచ్చిన నలుగురి జీనోమ్ సీక్వెన్సింగ్‌లో వారికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని ఆరోగ్యశాఖ తెలిపింది.

అయితే నలుగురి పరిస్థితి నిలకడగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. నలుగురిలో ముగ్గురు నాడియా జిల్లాకు చెందిన వారని, ఒకరు బీహార్ నివాసి అని, ప్రస్తుతం కోల్‌కతాలో నివసిస్తున్నారని అధికారులు తెలిపారు. గత వారం కూడా కోల్‌కతా విమానాశ్రయంలో కోవిడ్ -19 పరీక్షలో ఒక విదేశీ పౌరుడితో సహా ఇద్దరు వ్యక్తులు సోకినట్లు గుర్తించారు. అతని జీనోమ్ సీక్వెన్సింగ్ తర్వాత అతను ఓమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ BF.7 సోకినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. ఇప్పుడు ఈ వేరియంట్‌ చైనాలో బీభత్సం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఉంచారు.

అమెరికా నుంచి తిరిగి వచ్చిన యువతకి యూపీలో సోకినట్లు గుర్తించారు. విమానాశ్రయంలో స్క్రీనింగ్, టెస్టింగ్ కూడా చేస్తున్నారు. ఇదిలా ఉండగా, అమెరికాలో చదువుతున్న ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన యువకుడికి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కరోనా సోకింది. అమెరికా నుంచి వచ్చిన తర్వాత గొంతునొప్పి, దగ్గు, జ్వరంతో ఆయన ఆరోగ్యం క్షీణించిందని యూపీ ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. దీనిపై తన శాంపిల్‌ను పరీక్షకు పంపామని, దాని నివేదిక మంగళవారం వచ్చిందని, అతనికి కరోనా సోకిందని ఆయన చెప్పారు. ఇంట్లో ఒంటరిగా ఉండాలని కోరినట్లు అధికారి తెలిపారు.

ఇవి కూడా చదవండి

డబ్ల్యూహెచ్‌వో హెచ్చ రిక:

కొత్త సంవత్సరంలో కరోనా ముప్పు పొంచి ఉందని ఇప్పటికే అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కూడా హెచ్చరించింది. ఒక కొత్త వేవ్ రావచ్చని, ఇప్పుడు XBB.1.5 వేరియంట్ కూడా వేగంగా వ్యాప్తి చెందుతోందని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది. మరణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్