Delhi Death: ఢిల్లీ అంజలి కేసులో రోజుకో సంచలనం.. నిధిపై బలపడుతున్న అనుమానాలు..
ఢిల్లీలో రోడ్‌టెర్రర్‌కు బలైన అంజలి కేసులో రోజుకో సంచలనం బయటపడుతోంది. యాక్సిడెంట్ సమయంలో అంజలితో పాటు ఉన్న ఆమె ఫ్రెండ్ నిధిపై

ఢిల్లీలో రోడ్‌టెర్రర్‌కు బలైన అంజలి కేసులో రోజుకో సంచలనం బయటపడుతోంది. యాక్సిడెంట్ సమయంలో అంజలితో పాటు ఉన్న ఆమె ఫ్రెండ్ నిధిపై కుటుంబసభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఆమెను సరైన రీతిలో విచారించడం లేదని ఆరోపిస్తున్నారు అంజలి కుటుంబసభ్యులు. అసలు, నిధి ఎవరో తమకు తెలియదని అంటున్నారు అంజలి పేరెంట్స్. నిధితో అంజలిని తాము ఎప్పుడు చూడలేదని చెబుతున్నారు. యాక్సిడెంట్ సమయంలో అంజలి మద్యం సేవించిందన్న నిధి మాటల్లో నిజం లేదంటున్నారు. అంజలికి మద్యం అలవాటు లేదని, తన కూతురిని నిధి ఎందుకు టార్గెట్ చేసిందో అర్ధంకావడం లేదంటున్నారు అంజలి తల్లి.
అంజలిది రోడ్డుప్రమాదం కాదు, ఆమెను చంపేశారంటున్నారు కుటుంబ సభ్యులు. ఢిల్లీ ప్రజలు కూడా అంజలిది హత్యంటూ ఆందోళనలు చేస్తున్నారు. అంజలికి నివాళి అర్పిస్తూనే హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అంజలి FSLM రిపోర్ట్‌లో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కారు ముందు భాగంలోని ఎడమ చక్రానికి అంజలి డెడ్‌బాడీ ఇరుక్కున్నట్టు గుర్తించారు. శరీరంపై 36చోట్ల 40 తీవ్రగాయాలైనట్టు గుర్తించారు. అయితే, కారు లోపల మహిళ ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదంటున్నారు పోలీసులు.
అయితే, ప్రమాదం జరిగిన ప్రాంతానికి దగ్గర్లోనే నిధి ఇల్లు ఉండటం, యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఆమె ఇంటికి వెళ్లిపోవడంపై అనుమానాలు చెలరేగుతున్నాయ్. నిధి వ్యవహారశైలి అంతా అనుమానాస్పదంగానే కనిపిస్తోంది. పైగా ఫ్రెండ్‌కి యాక్సిడెంట్ అయితే పోలీసులకు కంప్లైంట్ చేయకుండా ఇంటికి వెళ్లిపోవడమే సస్పెన్స్‌గా మారింది. మరి, అంజలి డెత్ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో?. ఎలాంటి సంచలనాలు బయటికి వస్తాయో చూడాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..