Union Budget 2023: ఈ బడ్జెట్‌లో మాకు ప్రయోజనం కల్పించండి.. కేంద్ర ఆర్థిక మంత్రికి పేషెంట్‌ ఓ లేఖ రాస్తే?

Union Budget 2023ఇది బడ్జెట్‌ సమయం.. ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏ వర్గాలకు ఎలాంటి వరాల జల్లు కురిపిస్తారో అని చాలామంది ఎదురుచూస్తున్నారు. తమకు ఈ బడ్జెట్‌లో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో అంటూ..

Union Budget 2023: ఈ బడ్జెట్‌లో మాకు ప్రయోజనం కల్పించండి.. కేంద్ర ఆర్థిక మంత్రికి పేషెంట్‌ ఓ లేఖ రాస్తే?
Union Budget
Follow us
Amarnadh Daneti

|

Updated on: Jan 04, 2023 | 10:17 PM

Union Budget 2023ఇది బడ్జెట్‌ సమయం.. ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏ వర్గాలకు ఎలాంటి వరాల జల్లు కురిపిస్తారో అని చాలామంది ఎదురుచూస్తున్నారు. తమకు ఈ బడ్జెట్‌లో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో అంటూ ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి.. ఈ నేపథ్యంలో ఓ పేషేంట్.. కేంద్ర ఆర్థికమంత్రికి లేఖ రాస్తే ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం.

గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారూ,

నా పేరు ప్రకాష్.. నేను ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులో నివసిస్తున్నాను. కోవిడ్ చికిత్స సమయంలో నాకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అప్పటికే అది మూడో దశలో ఉన్నట్టు తేలింది. మా పెద్దమ్మాయి ఘజియాబాద్ లో ఉంటోంది. నా ఆరోగ్య పరిస్థితి తెలిసి ఆమె నన్ను తీసుకువచ్చింది. ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో నన్ను చూపించింది. పరీక్షలు అన్నీ చేసిన తరువాత.. నా చికిత్స కోసం ఖర్చు లక్షల్లో అవుతుందని ఆసుపత్రిలో చెప్పారు. ఈ ఖర్చు భరించే స్తోమత నాకు గానీ, నా కూతురుకు కానీ లేదు.నేను కర్నూలు లోని ఒక ఫ్యాక్టరీలో 40 సంవత్సరాలు పనిచేశాను. నేను 4 సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యాను. నాకు పీఎఫ్ ద్వారా 2500 రూపాయల పెన్షన్ వస్తుంది. నాకు ముగ్గురు అమ్మాయిలు. వారందరికీ పెళ్ళిళ్ళు చేసేశాను. నా ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా నేను ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే చికిత్స చేయించుకోగలను. నేను 2 రోజులుగా ఎయిమ్స్‌లో చేరేందుకు ప్రయత్నిస్తున్నాను, కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. అక్కడ చాలా తక్కువ మందికి మాత్రమే ప్రవేశం లభిస్తుంది. ప్రతిరోజూ మేము ఘజియాబాద్ నుంచి తెల్లవారుజామున బయలుదేరుతాము. ఎయిమ్స్ వద్ద పడిగాపులు కాస్తాము. కానీ నాకు అడ్మిషన్ దొరకదు. బహుశా అదృష్టం నాకు అనుకూలంగా లేదు. సాయంత్రం తిరిగి ఘజియాబాద్ చెరిపోతాను. ఇదే జరుగుతూ వస్తోంది రెండు రోజులుగా.

నిర్మలమ్మ గారూ.. నేనొక్కడినే కాదు, నాలాగే వందల మంది ఇలానే ఉన్నారు. ఈ రోజు కూడా నేను ఉదయాన్నే వచ్చాను. నేను గేట్ నంబర్ 3 బయట కూర్చున్నాను. నా కూతురు సరోజ ప్రస్తుతం లైన్‌లో ఉంది. ప్రస్తుతం ఆమె సంకల్పానికీ.. రోజురోజుకూ క్షీణిస్తున్న నా ఆరోగ్యానికీ మధ్య యుద్ధం జరుగుతోంది. త్వరలో బడ్జెట్ రాబోతోంది. కాబట్టి బడ్జెట్‌పై నా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు ఈ లేఖ రాయాలని అనుకున్నాను.

ఆర్థిక మంత్రి గారూ.. నాకు ఒక విషయం ఎప్పటికీ అర్ధం కావడం లేదు. నా జీవితమంతా కష్టపడి.. ప్రతి సంవత్సరం నా ఆదాయంలో కొంత భాగం పన్నులు చెల్లిస్తూ వచ్చాను. మరి నా ఈ ఇబ్బంది కార్య పరిస్థితుల్లో నేను ఇదంతా ఎందుకు భరించాలి? అసలు నేను చేసిన తప్పేంటి? నా వృద్ధాప్యంలో, నా ఆరోగ్యం క్షీణిస్తున్నప్పుడు, నేను.. నాలాంటి వారు చెల్లించే పన్నులతో నడుస్తున్న ఆసుపత్రి నాకు చికిత్స చేయలేకపోతోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఆరోగ్య సదుపాయాలు ఇంత అధ్వాన్నంగా ఉంటాయని నేనెప్పుడూ ఊహించలేదు. మేము చిన్న నగరాల గురించి ఎప్పుడూ తక్కువ చేసి చెప్పుకునే వాళ్ళం.. కానీ.. ఇంత పెద్ద నగరంలోని పెద్దాసుపత్రి కూడా మా నగరాల ప్రభుత్వాసుపత్రి లానే అనిపిస్తోంది. ఇక ఆయుష్మాన్ భారత్‌ యోజన నాలాంటి వారి కోసం కాదు. ఒకవేళ అది నాకు లభించినా.. అది క్యాన్సర్ వంటి వ్యాధులకు ఉపయోగపడేది కాదు.

మేడమ్ ఆర్థిక మంత్రి గారూ.. ప్రభుత్వం ఇంత భారీ బడ్జెట్‌ను కలిగి ఉందని నమ్మడం నాకు కష్టంగా ఉంది. ఎందుకంటే, ఇప్పటికీ మాలాంటి సాధారణ ప్రజలకు మంచి ఆరోగ్య సదుపాయాలను అందించలేకపోతోంది. ప్రతి జిల్లాకు ప్రభుత్వ ఆసుపత్రి ఉంటుందన్న వార్తకు నేను చప్పట్లు కొట్టిన సందర్భం నాకు ఇప్పటికీ గుర్తుంది. కానీ, ఇప్పటికీ నాలాంటి పేషెంట్లు రెట్టింపు కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. మాలాంటి వాళ్ళం వ్యాధి వలన వచ్చిన నొప్పితో మత్రమే కాకుండా ఆ వ్యాధి చికిత్స కోసం పడే నొప్పిని కూడా భరించాల్సిన పరిస్థితి ఉంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఇప్పుడు అమృత మహోత్సవం లాంటి ఉత్సవాలూ జరుపుకుంటున్నాం. కానీ ప్రభుత్వాసుపత్రుల్లో సరైన వైద్యం కూడా అందడం లేదు. గ్రాస్ రూట్ స్థాయిలో మీరు ప్రకటించిన పథకాల్లో పురోగతి లేదు.

మేడమ్ మేము కూడా మంచి చికిత్స, మందులకు అర్హులమే. మీరే ప్రభుత్వం.. మరి మీరు ప్రయివేటు ఆసుపత్రుల ఇష్టారాజ్యాన్ని అడ్డుకోలేకపోతున్నారా? పేద రోగులకు మంచి వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? కోవిడ్ మహమ్మారి కారణంగా నేను చాలామంది ప్రియమైన వారిని కోల్పోయారు. అప్పట్లో ఆస్పత్రుల్లో ఆక్సిజన్.. బెడ్ కూడా దొరకని పరిస్థితి ఇప్పటికీ మా కళ్ళముందు కదలాడుతొంది. అదలా ఉంచితే.. నాకు రోజురోజుకూ జబ్బు ఎక్కువవుతోంది. బహుశా నేను త్వరలో వెళ్ళిపోతాను. ఈ ఉత్తరం మీకు చేరే సమయానికి నేను బతికే ఉంటానో లేదో కూడా నాకు తెలియదు. కానీ మేడమ్ ఆర్థిక మంత్రి గారూ.. ప్రైవేట్ ఆసుపత్రిలో మంచి వైద్యం చేయించుకోలేని పేద రోగులందరి గురించి బడ్జెట్ లో కొద్దిగా అయినా ఆలోచించండి.

భవదీయుడు

ప్రకాష్

మెరుగైన ప్రభుత్వ వైద్యం కోసం లేఖ

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే