Noida: ఓయో రూమ్ కి గెస్ట్ గా వచ్చారు.. సీన్ కట్ చేస్తే.. జైలుకు వెళ్లారు..
నేరాలు చేయడం అలవాటుగా చేసుకున్న ఓ ముఠాలోని సభ్యులు ఓయో హోటళ్లలో గదులు బుక్ చేసి, వారు ఖాళీ చేయడానికి ముందు ఆ గదుల్లో రహస్య కెమెరాలను ఏర్పాటు చేశారని పోలీసులు తెలిపారు. ఓయో యాప్ ద్వారా బుక్..

కొంతమంది తమ తెలివితేటలను మంచికి బదులుగా చెడుకు ఉపయోగించి.. తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. డబ్బుల సంపాదనకు నేరాలను ప్రవృత్తిగా ఎంచుకుని జైలు పాలవుతున్నారు కొంతమంది యువత. తప్పని తెలిసినా నేరాలకు పాల్పడుతూ ఉజ్వల భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని నొయిడాలో జరిగిన ఓ ఘటన కూడా ఇలాంటిదే. ఓయో రూమ్ లో రూమ్స్ బుక్ చేసుకుని అతిథులుగా వెళ్లి ఆతర్వాత వారు స్టే చేసిన గదిలో రహస్యంగా కెమెరాలు పెట్టారు. కొద్ది రోజుల తర్వాత అదే ఓయో రూమ్ లో చెక్ ఇన్ అయి వారు ఏర్పాటు చేసిన కెమెరా తీసుకుని, అందులో రికార్డు అయిన వీడియోల ఆధారంగా కొన్ని జంటలను డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. విషయం తెలియడంతో నిందితులను అరెస్టు చేశారు పోలీసులు.
నేరాలు చేయడం అలవాటుగా చేసుకున్న ఓ ముఠాలోని సభ్యులు ఓయో హోటళ్లలో గదులు బుక్ చేసి, వారు ఖాళీ చేయడానికి ముందు ఆ గదుల్లో రహస్య కెమెరాలను ఏర్పాటు చేశారని పోలీసులు తెలిపారు. ఓయో యాప్ ద్వారా బుక్ చేసుకున్న హోటళ్లలోని గదుల్లో రహస్య కెమెరాలు పెట్టి కొన్ని జంటలకు సంబంధించిన సన్నిహిత క్షణాలను రికార్డ్ చేసి ఆ జంటలను డబ్బులు డిమాండ్ చేసిన నలుగురు వ్యక్తులను ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో పోలీసులు అరెస్టు చేశారు. వ్యక్తిగత విషయాలకు సంబంధిచిన వాటిని రికార్డు చేసి జంటలను బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు ఇవ్వకుంటే వీడియోలను లీక్ చేస్తామని బెదిరించేవారని పోలీసులు తెలిపారు. ఈ విషయంలో హోటల్ సిబ్బంది ప్రమేయం లేదని ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు.
ఈ ఘటనలో విష్ణు సింగ్, అబ్దుల్ వహవ్, పంకజ్ కుమార్, అనురాగ్ కుమార్ సింగ్ నిందితులని పోలీసులు వెల్లడించారు. వీరు నొయిడాలోని వివిధ ముఠాలకు చెందిన వారని, వీరంతా అనధికార కాల్ సెంటర్లు, అక్రమ కార్యకలాపాలకు నకిలీ సిమ్ కార్డులు అందించడం వంటి అనేక చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. నిందితుల నుండి 11 ల్యాప్‌టాప్‌లు, 21 మొబైల్‌లు, 22 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ముఠా దేశవ్యాప్తంగా తమ చట్టవిరుద్ధ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ముఠా సభ్యుల్లో ఒకరు పరారీలో ఉన్నారని, అతడిని అదుపులోకి తీసుకునేందుకు గాలిస్తున్నామన్నారు. నిందితులు విష్ణు సింగ్, అబ్దుల్ వహవ్ లు ఓ జంట ఫోన్‌కు రహస్యంగా చిత్రీకరించిన వీడియోలను పంపారు. తాము అడిగినంత డబ్బులు ఇవ్వాలని లేకపోతే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారన్నారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..