AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యాంకింగ్ రంగంలోకి దేశీ కార్పొరేట్ దిగ్గజాలు?.. సవరణల తర్వాత అనుమతిస్తామంటున్నఆర్బీఐ..

భవిష్యత్‌లో దేశీ కార్పొరేట్ దిగ్గజాలు బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. రిలయన్స్, అదానీ, ఎల్ అండ్ టీ వంటీ కంపెనీలు బ్యాంకింగ్ సేవలు అందించేందుకు ఉత్సాహంగా ముందుకొస్తున్నాయి.

బ్యాంకింగ్ రంగంలోకి దేశీ కార్పొరేట్ దిగ్గజాలు?.. సవరణల తర్వాత అనుమతిస్తామంటున్నఆర్బీఐ..
Jyothi Gadda
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Nov 21, 2020 | 5:24 PM

Share

భవిష్యత్‌లో దేశీ కార్పొరేట్ దిగ్గజాలు బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. రిలయన్స్, అదానీ, ఎల్ అండ్ టీ వంటీ కంపెనీలు బ్యాంకింగ్ సేవలు అందించేందుకు ఉత్సాహంగా ముందుకొస్తున్నాయి. ఆర్బీఐ ఇంటర్నల్ గ్రూప్ కూడా వీటి రాకకు మద్దతు తెలుపుతోంది. అయితే బ్యాంకింగ్ నియంత్రణ చట్టంలో కొన్ని సవరణలు చేయడంతో పాటు నియంత్రణ వ్యవస్థను పటిష్టం చేశాకే వీరిని అనుమతించాలని సూచిస్తోంది.. కార్పొరేట్ వ్యవస్థను సమీక్షించేందుకు 2020 జూన్ 12న ఆర్బీఐ ఓ వర్కింగ్ గ్రూప్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఈ బృందం విడుదల చేసిన నివేదికను శుక్రవారం విడుదల చేశారు.

ఇందులో భాగంగా 15 ఏళ్లలో ప్రైవేట్ బ్యాంకుల వాటా పరిమితిని 15 శాతం నుంచి 26 శాతానికి పెంచాలని నిర్ణయించారు. అంతేకాకుండా బడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలను ప్రైవేట్ బ్యాంక్‌లుగా మారేందుకు అవకాశం కల్పించాలని తెలిపారు. అలాగే కొత్తగా ప్రైవేట్ బ్యాంక్ లైసెన్స్‌ల జారీకి కనీస మూలధన అర్హతను ప్రస్తుతుమున్న రూ.500 కోట్ల నుంచి రూ. 1000 కోట్లకు పెంచాలని నిర్ణయించారు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లైసెన్స్‌ల జారీకి కనీస మూలధన పరిమితిని రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్లకు పెంచాలని సూచించారు. త్వరలో ప్రైవేటీకరించనున్న ప్రభుత్వ రంగ బ్యాంక్ మెజారిటీ వాటాలు కొనుగోలు చేసేందుకు కార్పొరేట్ కంపెనీలు, వీదేశీ బ్యాంక్‌లను అనుమతించాలని మోదీ సర్కారు యోచిస్తోందని సమాచారం. ఇదే విషయంపై కేంద్రం, ఆర్బీఐ మధ్య ప్రాథమిక చర్చ జరుగుతున్నట్లు కూడా తెలుస్తోంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం నాన్ ఫైనాన్షియల్ సంస్థ నుంచి 60 శాతం కంటే తక్కువ టర్నోవర్ లభిస్తున్న కార్పొరేట్ గ్రూప్‌లు బ్యాంక్ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతి లేదు. అయితే కార్పొరేట్ల రంగ ప్రవేశంతో బ్యాంకింగ్ రంగ స్థిరత్వానికి భంగం కలగవచ్చన్న భయంతో ఆర్బీఐ ఇప్పటివరకు వీటిని అనుమతించలేదు.